నాగార్జున తర్వాత మన తెలుగు ఇండస్ట్రీలో ఎక్కువగా ఎఫైర్లతో వార్తల్లోకెక్కిన ఏకైక కథానాయకుడు రాణా. ఈ భాల్లాల దేవుడి మీద వచ్చినన్ని ఎఫైర్ న్యూస్ లు కానీ గాసిప్పులు కానీ నవతరం కథానాయకులెవరి మీదా రాలేదు. మొదట త్రిష, ఆ తర్వాత బిపాసా, అనంతరం ఇలియానా, మధ్యలో శ్రియ, ఆ తర్వాత రకుల్.. రీసెంట్ గా రాశీఖన్నా. ఇలా రాణా ఎఫైర్ న్యూస్ కనీసం నెలకొకటైనా వినిపిస్తుంటుంది. అందుకే రాణా బాబుని ప్లే బోయ్ ఆఫ్ టి.ఆఫ్.ఐ అంటుంటారు మన ఇండస్ట్రీ జనాలు.
పైన పేర్కొన్న అందరి హీరోయిన్లలో రాణా ఎక్కువకాలం డేట్ లేదా సహజీవనం చేసింది మాత్రం త్రిషతోనే. బాబాయ్ వెంకటేష్ తో మూడు సినిమాల్లో కలిసి నటించిన త్రిష అంటే రాణాకి ముందు నుంచీ చాలా ఇష్టం. అందుకే తాను కథానాయకుడిగా పరిచయమయ్యాక.. ఆమెతో కలిసి నటించకపోయినా అవార్డ్ ఫంక్షన్స్ లో ఆమెతో చెట్టాపట్టాలేసుకొని తిరిగాడు. చాలాసార్లు పబ్లిక్ గా దొరిపోయినా పెద్దగా ఫీల్ అవ్వలేదు. మరి తర్వాత ఏమైందో తెలియదు కానీ.. ఇద్దరికీ బ్రేకప్ అయ్యింది. త్రిష వేరే అబ్బాయితో ఎంగేజ్ మెంట్ చేసుకోగా, రాణా కొత్తమ్మాయిని వెతుక్కోవడంలో బిజీ అయిపోయాడు. ఇదంతా చరిత్ర.
మళ్ళీ ఈ విషయాన్ని తిరిగి తోడడం వెనుక ఉన్న కథ ఏమిటా అని ఆలోచించేస్తున్నారా. రాణాతో దాదాపు మూడేళ్ళ పాటు రిలేషన్ లో ఉన్న విషయాన్ని త్రిష కూడా మర్చిపోయి ప్రశాంతగా మంచి సినిమాలు చేసుకుంటూ గడిపేస్తుండగా.. ఇటీవల కాఫీ విత్ కరణ్ షోలో రాణా తన ఎక్స్ అయిన త్రిష గురించి చేసిన వ్యాఖ్యలు ఆమెను చాలా డిస్టర్బ్ చేశాయట. తప్పంతా త్రిషదే అన్నట్లుగా రాణా ఇష్యూని కవర్ చేయడం ఆమెకు అస్సల నచ్చలేదంట. దాంతో తన ఫ్రెండ్స్ మరియు ఇండస్ట్రీ ఇన్నర్ సర్కిల్స్ కి రాణా తనతో పర్సనల్ గా షేర్ చేసుకున్న విషయాలను డిస్కస్ చేయడం మొదలెట్టింది. ఆ విషయాలు ఎలాగూ వైరల్ అవుతాయి కాబట్టి.. రాణా కూడా షాక్ అవుతున్నాడట. దాంతో ఎప్పుడో సమసిపోయిందనుకున్న సమస్య మళ్ళీ ఇలా తెరమీదకి రావడంతో తలపట్టుకొన్నాడట రాణా. మరి ఈ ఇష్యూ ఎక్కడిదాకా వెళ్తుందో చూడాలి.