Advertisementt

ప్రభాస్, అనుష్క.. దంపతుల కంటే ఎక్కువగా!!

Tue 01st Jan 2019 07:56 AM
prabhas,anushka,karthikeya wedding,pooja,ss rajamouli,prabhas and anushka,jaipur  ప్రభాస్, అనుష్క.. దంపతుల కంటే ఎక్కువగా!!
Prabhas And Anushka Hulchal at Karthikeya Wedding ప్రభాస్, అనుష్క.. దంపతుల కంటే ఎక్కువగా!!
Advertisement
Ads by CJ

దాదాపు టాలీవుడ్ స్టార్స్ అందరూ రాజమౌళి కుమారుడు కార్తికేయ వివాహానికి వెళ్లారు. జగపతి బాబు అన్న కూతురు పూజాని ప్రేమించి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నాడు కార్తికేయ. మూడు రోజులు ముందే టాలీవుడ్ నుంచి చాలామంది స్టార్స్ జైపూర్ కి వెళ్లారు. అక్కడ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ లో.. సంగీత్ లో సరదాగా ఎంజాయ్ చేసారు.

జైపూర్‌లోని ఓ ప్యాలెస్‌ ఈ వివాహానికి వేదిక కాగా.. నిన్న రాత్రి వరుడు కార్తికేయ, వధువు పూజా ప్రసాద్‌ పెళ్లి ఘనంగా జరిగింది. టాలీవుడ్ నుండి నాగార్జున, ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్, రానా, అఖిల్.. తదితరులు వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ప్రీ వెడ్డింగ్ నుండి అప్పగింతల వరకూ తారక్‌, ప్రభాస్, రామ్ చరణ్‌, రానాలు రాజమౌళితోనే కలిసుండటం గమనార్హం.

అయితే నిన్న పెళ్లి సందర్భంగా పెళ్లి కూతురు పూజాని పెళ్లి మండపంకి తీసుకొస్తున్న టైములో ప్రభాస్ కూడా ఆమె కూర్చున్న పల్లకిని తన చేతులతో మోస్తూ వివాహ మండపానికి తీసుకు వచ్చారు. అలానే పెళ్లి మండపం పైన అనుష్క అండ్ ప్రభాస్ పక్కనే ఉండి పెళ్లి జరిపిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోతో మరోసారి అనుష్క, ప్రభాస్‌లు దంపతుల కంటే ఎక్కువగా ఈ పెళ్లిలో ఇన్‌వాల్వ్ అయ్యారని, వారు ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటారనే వార్తలు దర్శనమిస్తుండటం విశేషం.

Prabhas And Anushka Hulchal at Karthikeya Wedding:

Again Rumours on Prabhas and Anushka Relation

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ