Advertisementt

నందమూరి వారసుడి గురించే.. ఈ అప్డేట్!

Tue 01st Jan 2019 07:49 AM
mokshagna,sheds weight drastically,balakrishna,nandamuri fans,balayya son,ntr biopic  నందమూరి వారసుడి గురించే.. ఈ అప్డేట్!
Mokshagna gets Slimmer! నందమూరి వారసుడి గురించే.. ఈ అప్డేట్!
Advertisement
Ads by CJ

నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినిమాల్లోకి రాబోతున్నాడని గత రెండేళ్లుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ మోక్షజ్ఞ ఎంట్రీపై క్లారిటీ ఇవ్వట్లేదు బాలయ్య. మోక్షజ్ఞ లావుగా ఉండడంతో అతను వెయిట్ తగ్గాలని ప్రత్యేకమైన ట్రైనర్స్ ను ఏర్పాటు చేసి వారి వద్ద శిక్షణ ఇపిస్తున్నాడట బాలకృష్ణ. 

పలు దేశాల్లో మోక్షజ్ఞ నటన మరియు డ్యాన్స్‌లో శిక్షణ తీసుకుంటున్నాడని, మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకుంటున్నాడని సమాచారం. ఫ్యామిలీ ఈవెంట్స్‌లో మోక్షజ్ఞని చూపించకుండా చాలానే ట్రై చేస్తుంది బాలకృష్ణ అండ్ టీం. అక్క తేజస్వి పెళ్లిలో కూడా మోక్షజ్ఞని హైడ్ చేసారు. రీసెంట్‌గా జరిగిన ఎన్టీఆర్ ఆడియో రిలీజ్ ఈవెంట్‌లో కూడా మోక్షజ్ఞ కనిపించలేదు. 

హెవీ బాడీతో కనిపిస్తే బాగోదని బాలయ్య భావిస్తున్నాడట. దాంతో మోక్షజ్ఞ ఇప్పుడు ఎలా ఉన్నాడు అని నందమూరి ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ నేపధ్యంలో మోక్షజ్ఞ కొంతమంది కంట పడ్డట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్ లో ‘కెజియఫ్’ సినిమా ప్రత్యేక షోను తల్లిదండ్రులతో కలిసి చూసేందుకు మోక్షజ్ఞ వచ్చాడట. 

అక్కడ మోక్షజ్ఞను కొంతమంది చూశారట. వారు చెబుతున్న ప్రకారం... మోక్షజ్ఞ లావు తగ్గాడని.. సినిమాల్లో వచ్చే ఏడాది ఎట్టి పరిస్థితుల్లో ఎంట్రీ ఇవ్వాలనే కసితో లావు తగ్గుతున్నట్లుగా తెలుస్తోంది అని అన్నారు. లావు తగ్గడమే కాదు హైట్ గా కూడా ఉన్నాడని చూడటానికి హీరోలా ఉన్నాడని చెబుతున్నారు. 

సో వచ్చే ఏడాదే మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఉండబోతుందని చెబుతున్నారు. ఎన్టీఆర్ బయోపిక్ లో మోక్షజ్ఞ కనిపిస్తాడనే ప్రచారం జరిగినా అది పుకార్లే అని తేలింది. కానీ మోక్షజ్ఞ  వారాహి బ్యానర్ లోనే లాంచ్ అవుతాడని తెలుస్తుంది. అయితే డైరెక్టర్ ఎవరు అనేది మాత్రం క్లారిటీ లేదు. సో వచ్చే ఏడాది నందమూరి ఫ్యాన్స్ కు బాలయ్య ట్రీట్ ఇవ్వనున్నాడు.

Mokshagna gets Slimmer!:

Mokshagna Sheds Weight Drastically?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ