సూపర్ స్టార్ రజినీకాంత్ - శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన విజువల్ వండర్ ‘2.ఓ’. అక్షయ్ కుమార్ ప్రతినాయకుడిగా నటించిన ఈ సినిమా వసూల్ పరంగా దూసుకుపోతుంది. మొదటి రోజు డివైడ్ టాక్ ఓపెనింగ్ బాగానే చేసింది. తొలిరోజు నుండే రికార్డులను నమోదు చేయడం మొదలుపెట్టిన ఈ సినిమా రీసెంట్ గా మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.
తమిళ.. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా ఒక ఊపు ఊపేస్తున్న ఈసినిమా అంతర్జాతీయ బాక్సాఫీస్ దగ్గర 700 కోట్ల (100 మిలియన్ డాలర్స్)ను వసూలు చేయడం విశేషం. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 100 మిలియన్ డాలర్స్ ను రాబట్టిన చిత్రాలు 53 ఉంటే... అందులో ఇండియా నుండి 2 ఉన్నాయి.
ఇండియా నుండి అమీర్ ఖాన్ నటించిన ‘సీక్రెట్ సూపర్ స్టార్’ తో పాటు రజనీ ‘2.ఓ’ చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా 100 మిలియన్ డాలర్స్ ను రాబట్టాయి. అమీర్ ‘సీక్రెట్ సూపర్ స్టార్’ చైనా వసూళ్లతో కలుపుకుని ఈ జాబితాలో చేరింది. ‘2.ఓ’ మాత్రం చైనా వసూళ్లతో సంబంధం లేకుండగానే ఈ జాబితాలో చేరడం విశేషం. ఇద్దరు సూపర్ స్టార్స్ ఒకే రికార్డును క్రియేట్ చేయడం విశేషం.