టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ మావయ్య కాబోతున్నాడు. రాజమౌళి కుమారుడు కార్తికేయ పెళ్లి జరగబోతుంది. ప్రముఖ నటుడు జగపతి బాబు అన్న కూతురు పూజా ప్రసాద్‌తో డిసెంబర్ 30, ఆదివారం పెళ్లి జరగబోతోంది. రాజమౌళి కుటుంబం, జగపతిబాబు కుటుంబం ఒక్కటి కాబోతోంది. ఆదివారం వీరి పెళ్లి జైపూర్‌లో గ్రాండ్‌గా జరుగనుంది. ఈనేపధ్యంలో పలువురు సినీ ప్రముఖులు, సన్నిహితులు రాజస్తాన్‌కు చేరుకుంటున్నారు.
రెండు రోజులు ముందే ఎన్టీఆర్, రానా, ప్రభాస్, అనుష్క, నాని వెళ్లడం విశేషం. తాజాగా ఈ టీమ్‌లో రామ్ చరణ్ కూడా జాయిన్ అయ్యాడు. ఈరోజు(శనివారం) చాలామంది స్టార్స్ ఇక్కడ నుండి పెళ్లికి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా అందరు అక్కడ పాటలకు స్టెప్స్ వేయడం...సరదాగా ఉండటం ఆ వీడియోస్ బయటికి రావడం జరిగింది. ప్రస్తుతం ఈ వీడియోస్ అండ్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎక్కడ చూసినా ఈ వీడియోలే దర్శనమిస్తున్నాయి.
ఇక్కడ విషయం ఏంటంటే ప్రభాస్, అనుష్క, రామ్ చరణ్‌తో పాటు రాజమౌళి కూడా డ్యాన్స్ చేయడం. ఇక్కడి నుంచి వెళ్ళిన సెలెబ్రెటీస్‌కి అక్కడ 7 స్టార్ హోటల్‌లో అతిధి మర్యాదలు చేస్తున్నారట. ఈ వివాహ వేడుక జైపూర్‌లో ఓ హోటల్ లో జరగనుంది. ఇలా టాలీవుడ్ సెలెబ్రెటీస్ మొత్తం ఒకే వేదికపైకి వచ్చి సరదాగా ఉండటం చూసి చాలా ఏళ్ళు అయింది. ఫ్యాన్స్ కు ఇదొక పండగ. అందరిని ఒకే వేదికపైకి తీసుకుని రావడం జక్కన్నకే సాధ్యం అంటూ సోషల్ మీడియా హోరెత్తుతుంది.