ప్రతి సంక్రాంతి లాగే ఈ సంక్రాంతికి కూడా తెలుగులో బాక్సాఫీస్ వద్ద హడావిడి చేయడానికి మూడు స్ట్రెయిట్ సినిమాలు.. ఒక డబ్బింగ్ మూవీ వస్తున్నాయి. టాలీవుడ్‌లో సంక్రాంతి సీజన్‌కు ఉన్న క్రేజ్ మరో సీజన్‌కి ఉండదు. పెద్ద స్టార్స్ సినిమాలు.. పెద్ద ప్రొడ్యూసర్స్ సినిమాలు ఈ సీజన్ లోనే రిలీజ్ అవుతుంటాయి. వీటితో పాటు మీడియం రేంజ్ సినిమాలు.. చిన్న సినిమాలు ఈ సీజన్‌లో విడుదల చేయాలన్న ఆలోచన కూడా ఆ ప్రొడ్యూసర్స్ కి రాదు.
కంటెంట్ బాగుంటేనే సినిమాని ఎంకరేజ్ చేస్తారు మన ప్రేక్షకులు. ఏమాత్రం తేడా అనిపించినా పక్కకి నెట్టేస్తున్నారు. ఈ క్రమంలో తెలుగులో వస్తున్న సినిమాల చూస్తే జనవరి 9న ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, జనవరి 10 ‘పేట’, జనవరి 11న ‘వినయ విధేయ రామ’, జనవరి 12న ‘F2’ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఎప్పుడూ లేని విధంగా ఈసారి బాక్సాఫీస్ హీట్ గా ఉండనుంది. అయితే పండగకు ముందే ఈ నాలుగు సినిమాలు రావడం విశేషం. సంక్రాంతి శెలవులు మొదలయ్యే లోపే ఏ సినిమా ఎలా ఉంది అనే సంగతి తెలిసిపోతుంది.
సినిమా హిట్ అయినా.. ఫట్ అయినా మనకు ముందే తెలిసిపోనుంది. హిట్ టాక్ వస్తే ఆ సినిమాకు వసూల్ ఒక రేంజ్‌లో వస్తాయి. ప్లాప్ టాక్ వస్తే మాత్రం రిజల్ట్ దారుణంగా ఉంటుంది. కంటెంట్ బాగున్న సినిమాలే బాక్సాఫీస్ వద్ద నిలబడే ఛాన్స్ ఉంది. అయితే ఈనాలుగు సినిమాల మేకర్స్ తమ సినిమాల విజయంపై నమ్మకంగా ఉన్నారు. మరి ఈ రేస్ లో ఎవరు విన్ అవుతారో చూడాలి.