ఎన్టీఆర్ బయోపిక్‌పై ముప్పెట దాడికి అంతా సిద్ధమవుతున్నారా?...చంద్రబాబుపై వున్న కోపం ఎన్టీఆర్‌కు షాపంగా మారబోతోందా? అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. `ఎన్టీఆర్` బయోపిక్ టాలీవుడ్‌లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. స్వర్గీయ నందమూరి తారకరామారావు జీవిత కథని భావితరాలకు చూపించాలనే సంకల్పంతో బాలయ్య చేస్తున్న ఈ సినిమాపై ఆది నుంచి నీలినీడలే కమ్ముకుంటున్నాయి. ప్రారంభోత్సవం వరకు వున్న దర్శకుడు తేజ ఆ తరువాత తొలి షెడ్యూల్ మొదలవుకముందే తప్పుకోవడం సంచలనం సృష్టించింది. ఆ తరువాత `ఎన్టీఆర్` బయోపిక్ `నర్తనశాల` తరహాలో ఆగినట్టేనా? అని అంతా అనుకున్నారు. అయితే `మణికర్ణిక`ని పక్కన పెట్టి `ఎన్టీఆర్` కోసం క్రిష్ రావడంతో సినిమా పట్టాలెక్కింది.
ఇక ఈ చిత్రం కార్యరూపం దాల్చడానికి ప్రధాన కారకుడు విబ్రి మీడియా అధినేత విష్ణు ఇందూరి. ఈ సినిమాకు సంబంధించిన కార్యక్రమాల్లో అతని ఊసే వుండటం లేదు అనేది గత కొంత కాలంగా `ఎన్టీఆర్` చిత్ర బృందాన్ని వెంటాడుతోంది. ఇవన్నీ ఒక వైపు అయితే ఈ చిత్రంపై పరోక్షంగా రామ్‌గోపాల్‌వర్మ చేస్తున్న దాడి మరింత కలవరపెడుతోంది. `లక్ష్మీస్ ఎన్టీఆర్` అంటూ వర్మ `ఎన్టీఆర్` సినిమాపై దాడి చేస్తున్న విషయం తెలిసిందే. కుట్ర, వెన్నుపోటు అంటూ ఇప్పటికే ఓ పాటను కూడా విడుదల చేసిన వర్మ ఆ తరువాత ఏకంగా ఎన్టీఆర్ మరణం తరువాత జరిగిన భీవావహ వాతావరణాన్ని...ఆయన చావుకు ఎవరు కారణమో కళ్లకు కట్టినట్లు చూపించే ఓ వీడియోను వదిలి కలకలం సృష్టించాడు.
ఇదిలా వుంటే ఎన్టీఆర్‌పై మరో వ్యక్తి కత్తి దూస్తున్నాడు. ఆయనే మాజీ ముఖ్యమంత్రి నాదేండ్ల భాస్కర్‌రావు. ఎన్టీఆర్ రాజకీయ జీవితంలో కీలక పాత్ర పోషించిన ఆయన ఇప్పడు కూడా అదే తరహాలో `ఎన్టీఆర్` చిత్రానికి ప్రతిబందకంగా మారబోతున్నారు. ఎన్టీఆర్ బయోపిక్‌లో తనను తప్పుగా చిత్రీకరిస్తే మాత్రం యూనిట్‌లో ఎవరినీ వదలనని అప్పుడే వార్నింగ్‌లు ఇస్తున్నారాయన. ఇప్పటికే చిత్ర యూనిట్‌కు రెండు దఫాలుగా నోటీసులు జారీ చేశానని, వాటిని ధిక్కరించి తనను విలన్‌గా చూపించే ప్రయత్నం చేస్తే చిత్ర యూనిట్‌పై కఠిన చర్చలు తప్పవని హెచ్చరిస్తుండటంతో `ఎన్టీఆర్` మరింత వివాదంగా మారే అవకాశం కనిపిస్తోందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.