తాజాగా రామ్‌చరణ్-బోయపాటిశ్రీను-దానయ్యల ‘వినయ విధేయ రామ’ చిత్రం ప్రీరిలీజ్ వేడుక ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఇక ఈ వేడుకలో ఇద్దరి లుక్‌లు, మేకోవర్‌లు అందరినీ బాగా అలరించాయి. అందులో మొదటి వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి కాగా, రెండో వ్యక్తి సంచలన సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌ది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ఒక ముఖ్య అతిధిగా హాజరయ్యాడు. ప్రస్తుతం ఆయన తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ప్రతిష్టాత్మక 151వ చిత్రాన్ని సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తన కుమారుడు రామ్‌చరణ్ నిర్మాతగా కొణిదెల బేనర్‌లో చేస్తున్నాడు. ‘బాహుబలి’ని టార్గెట్ చేసి, ఆ చిత్రం తర్వాత టాలీవుడ్ నుంచి వస్తూ అంతటి విజయాన్ని నమోదు చేస్తుందని భావిస్తున్న చిత్రం ‘సైరా.. నరసింహారెడ్డి’. ఇందులో ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా తొలి స్వాతంత్య్ర సమరయోధుడి పాత్రను మెగాస్టార్ పోషిస్తున్నాడు. బిగ్‌బి అమితాబ్‌బచ్చన్, నయనతార, సుదీప్, విజయ్‌సేతుపతి, జగపతిబాబు వంటి భారీ తారాగాణంతో ఈ మూవీ రూపొందుతోంది.
అయితే గత నాలుగు నెలలుగా మెగాస్టార్ ఎలా ఉన్నాడు? అనే విషయం, లుక్, మేకోవర్‌లు బయటకు రాకుండా యూనిట్ జాగ్రత్తపడుతోంది. కానీ ‘వినయ విధేయ రామ’ చిత్రం, రామ్‌చరణ్ పుణ్యమా అని మెగాస్టార్ ఈ వేడుకకు హాజరుకావడంతో ఆయనను చూసే అవకాశం లభించింది. మెగాస్టార్ ఎంతో సన్నబడి అద్భుతంగా ఉన్నారు. ఆయన రామ్‌చరణ్ పక్కన కూర్చుంటే అన్నదమ్ములు అనిపించేలా ఉన్నారు. ఇదే కాంప్లిమెంట్‌ని కేటీఆర్ కూడా ఇవ్వడం విశేషం. ఇక బాడీ తగ్గించితే వాళ్ల మొహంలో కూడా విపరీతమైన మార్పులు కనిపిస్తాయి. అందునా మెగాస్టార్ వయసు ఉన్న వారికి ఇది మరింత డేంజర్ కానీ శరీరంలో బరువు తగ్గి స్లిమ్‌గా తయారవ్వడమే గానీ మెగాస్టార్ మొహంలో ఎలాంటి మార్పులు కనిపించలేదు. దాంతో ఈ విషయంలో చిరు బాగా కసరత్తు చేసినట్లు అర్ధమవుతోంది. ఈ విషయంలో ఆయన ట్రైనర్‌ని కూడా అభినందించాలి.
మరోవైపు సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ అంటే ఎప్పుడు ఫిట్‌గా, డిఫరెంట్ కాస్ట్యూమ్స్‌తో కనిపిస్తూ ఉంటాడు. సంగీత దర్శకుల్లో ఇలా మరీ ముఖ్యంగా తెలుగులో జనాలకు ఆకర్షించేలా కనిపించే మరో సంగీత దర్శకుడు మనకి కనిపించడు. అందుకే ఆయనను హీరోగా పరిచయం చేయాలని చూస్తున్నారు. ఇక ఈ వేడుకకు ఎప్పుడు లేని విధంగా ఆయన డిఫరెంట్ హెయిర్‌స్టైల్‌తో కూడా కనిపించాడు. దీనిని చూస్తే 70-80ల మొదట్లో మైఖేల్ జాక్సన్ కనిపించిన లుక్ కనిపిస్తోంది. అయితే ఈయనను చూసిన కొందరు బాలసాయిబాబు వచ్చాడని కూడా సెటైర్లు వేస్తుండటం గమనించాల్సిన విషయం.