హీరోయిజాన్ని పీక్స్‌లో చూపించడంలో, పవర్‌ఫుల్‌గా మూవీస్‌ని తెరకెక్కించడంలో బి.గోపాల్, వినాయక్‌ల తర్వాత ప్రముఖంగా చెప్పుకోవాల్సింది ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను గురించే. అయితే బోయపాటి హీరోల ఇమేజ్‌కి, క్రేజ్‌కి తగ్గ మాస్ అంశాలకు చోటిస్తూనే మిగిలిన ఫ్యామిలీ ఎమోషన్స్‌ని కూడా అద్భుతంగా తీస్తాడు. అందుకే ఆయన తీసే యాక్షన్ చిత్రాలు కూడా ఇతర దర్శకుల్లా కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను బాగా అలరించి, ఘనవిజయాలు సొంతం చేసుకుంటూ ఉంటాయి. ‘భద్ర నుంచి తులసి, సింహా, లెజెండ్, సరైనోడు, జయ జానకి నాయక’ వంటి చిత్రాలు అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించాయి. ఇక ‘జయ జానకి నాయక’కి శ్రీనివాస్ కాకుండా పవర్‌ఫుల్ హీరో అయితే బాగుండేదనే వార్తలు రావడం తెలిసిన విషయమే.
తాజాగా బోయపాటి ‘జయ జానకి నాయక’ నుంచి ‘వినయ విధేయ రామ’కి కూడా కాస్త పొయిటిక్ టచ్ ఉండేలా, ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఆకర్షించేలా సాఫ్ట్ టైటిల్స్‌ని ఎంచుకుంటూ వస్తున్నాడు. ‘వినయ విధేయ రామ’లో రామ్‌చరణ్‌కి అన్నయ్యలను, వదినలను బాగానే ఫిక్స్ చేసి ఫ్యామిలీ సెంటిమెంట్‌ని కూడా బాగా పండించాడనే వార్తలు వస్తున్నాయి. కానీ ఈ చిత్ర ట్రైలర్‌లో మాత్రం బోయపాటి-చరణ్‌లు తమ శైలికి తగ్గట్టు ఊరమాస్ అంశాలనే చూపిస్తూ కట్ చేశారు. మొదట్లోనే చరణ్ రౌడీలను చితకబాదే సీన్‌తో స్టార్ట్ చేశారు. ఆ తర్వాత కాస్త ఫ్యామిలీ సీన్స్‌ని చూపించి చూపించనట్లుగా చేసి మరలా యాక్షన్‌లోకి వెళ్లిపోయారు. ఇక అజర్‌బైజాన్ లోకేషన్లలో ఊరమాస్‌గా ఉన్న చరణ్ చేత అంతే పవర్‌ఫుల్ డైలాగ్స్‌గా ‘సరైన సింహం తగలనంత వరకు ప్రతి వేటగాడు మగాడేరా...నాకు నీలా సైన్యం లేదు. ఒంట్లో బెరుకు లేదు. చావంటే అస్సలు భయం లేదు’ అని ‘బై బర్తే డెత్‌ని గెలిచొచ్చానురా’ అనే డైలాగ్స్ మెగాభిమానులను ఆనందంలో ముంచెత్తుతున్నాయి.
ఇక హీరోని ఎంత పవర్‌ఫుల్‌గా ప్రజెంట్ చేస్తాడో విలన్స్‌ని కూడా అదే స్థాయిలో చూపించే బోయపాటి వివేక్ ఒబేరాయ్‌ని చూపించే ఇంట్రో సీన్ కూడా అద్భుతంగా ఉంది. ‘ఈ ప్రాంతంలో వోటయినా, మాటైనా, తూటా అయిన నాదే’ అంటూ ఈ క్యారెక్టర్‌ని బలమైన డైలాగ్‌ని పెట్టాడు. ఇలా ఊరమాస్‌గా ఈ మొదటి ట్రైలర్ నిలుస్తుంది. మొదటి ట్రైలర్ ద్వారా యాక్షన్ చిత్రాలు ప్రేక్షకులను, మెగాభిమానులను టార్గెట్ చేయడమే బోయపాటి లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఫ్యామిలీ ఎమోషన్స్ కోసం విడుదలకు ముందు మరో ట్రైలర్‌ను వదిలే అవకాశం ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. రామ్‌చరణ్ నుంచి ‘ధృవ, రంగస్థలం’ వంటి రెండు విభిన్న చిత్రాల తర్వాత సరైన యాక్షన్‌డోస్, ఊరమాస్ కవరింగ్ ఇవ్వడం విశేషంగానే చెప్పాలి.