Advertisementt

‘మిస్టర్ మజ్ను’కు స్ఫూర్తి ఈ చిత్రమేనా?

Fri 28th Dec 2018 11:27 PM
bachna ae haseeno,mr majnu,akhil akkineni,venky atluri,mr majnu,copy rumours  ‘మిస్టర్ మజ్ను’కు స్ఫూర్తి ఈ చిత్రమేనా?
Rumours on Mr Majnu Movie Story ‘మిస్టర్ మజ్ను’కు స్ఫూర్తి ఈ చిత్రమేనా?
Advertisement
Ads by CJ

అక్కినేని అఖిల్ రెండు డిజాస్టర్స్ తరువాత వెంకీ అట్లూరి‌పై ఆశలు పెట్టుకుని ‘మిస్టర్ మజ్ను’ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈసినిమా రెండు నెలల్లో రిలీజ్ కానుంది. ఇందులో అఖిల్ ప్లే బాయ్ పాత్రలో నటిస్తున్నాడు. రీసెంట్ గా వచ్చిన టీజర్.. సాంగ్స్ చూస్తే అదే అర్ధం అవుతుంది.

ఎటువంటి హడావిడి లేకుండా ఈసినిమాను స్టార్ట్ చేసేసారు మేకర్స్. ఎక్కడా చప్పుడు కాకుండా ఈసినిమాను చకచకా ఫినిష్ చేసేసారు. నాగ్ కూడా ఈ సినిమా విషయంలో పెద్దగా ఇన్‌వాల్వ్ కాలేదు. దాంతో కొంతమందికి ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో అనుమానాలు వచ్చాయి. ఇది కాపీ సినిమా అని తెలుస్తుంది. టీజర్ బట్టి.. యూనిట్ సభ్యుల చెబుతున్న ప్రకారం చూస్తుంటే ఇది బాలీవుడ్‌లో చాలా ఏళ్ల కిందట ‘బచ్నాయే హసీనా’ అనే సినిమా నుంచి స్ఫూర్తి పొంది తీస్తున్నట్టుగా అర్ధం అవుతుంది.

‘బచ్నాయే హసీనా’ సినిమా రణబీర్ కపూర్ కెరీర్ ఆరంభంలో వచ్చింది. ఇందులో రణబీర్ ప్లేబాయ్‌గా కనిపిస్తాడు. దీపికా పదుకొనే, బిపాసాబసు కథానాయికలుగా హీరోయిన్స్‌గా నటించిన ఈ సినిమాలో రణబీర్ అమ్మాయిలని ట్రాప్ చేస్తుంటాడు. చివరికి అతడికి హీరోయిన్ నుంచి షాకులు తగులుతాయి. ఈ క్రమంలో అతడు మంచి వాడిలా మారిపోతాడు. ఈ లైనే ‘మిస్టర్ మజ్ను’ కోసం వెంకీ తీసుకుని డెవలప్ చేసాడని సమాచారం. ‘బచ్నాయే హసీనా’ బాలీవుడ్‌లో యావరేజ్ గా ఆడింది. మరి ‘మిస్టర్ మజ్ను’ అంతకు మించి ఆడుతుందా? అంటే కొన్ని రోజులు వరకు ఆగాల్సిందే. ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. ఒకవేళ సేమ్ లైన్ తీసుకుంటే వారి నుండి రీమేక్ రైట్స్ తీసుకున్నారో లేదో తెలియాలి. కానీ అఖిల్ కు ఈసినిమా హిట్ అవ్వడం చాలా అవసరం.

Rumours on Mr Majnu Movie Story :

Mr Majnu Movie gets Inspiration From bachna ae haseeno

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ