తనకు హిట్ ఇచ్చిన దర్శకులతో తప్ప ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్స్ ఎవరితోనూ మరో సినిమా చేయడానికి మహేష్ బాబు ఇప్పటివరకూ కనీసం ఆసక్తి కూడా చూపలేదు. అలాంటిది తనకు 1 నేనొక్కడినే లాంటి డిజాస్టర్ ఇచ్చిన సుకుమార్ ఒక్కరితో మాత్రం వర్క్ చేయడానికి మహేష్ ఒప్పుకోవడం పెద్ద సంచనలమే సృష్టించింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో సినిమా ఎనౌన్స్ మెంట్ కూడా జరిగిపోయింది. రంగస్థలం సక్సెస్ తర్వాత మంచి ఫామ్ అందిపుచ్చుకున్న సుకుమార్ కూడా తనకు రెండో అవకాశం ఇచ్చిన మహేష్ బాబుకి ఒక బ్లాక్ బస్టర్ ఇవ్వడమే ధ్యేయంగా పెట్టుకొని కథ, కథనాలు రాసుకోవడం మొదలెట్టాడు.
1 నేనొక్కడినే లాంటి కాంప్లికేటెడ్ కథతో కాకుండా ఒక డిఫరెంట్ కమర్షియల్ ఎంటర్ టైనరుతో ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేయాలని ప్లాన్ చేశాడు సుకుమార్. అక్కడే వచ్చింది అసలు సమస్య.. సుకుమార్ అనగానే ఏదైనా డిఫరెంట్ సబ్జెక్ట్ చెబుతాడేమో అని ఎదురుచూసిన మహేష్ బాబు.. సుకుమార్ వచ్చి చాలా సాధారణమైన కమర్షియల్ కథలు చెబుతుంటే షాక్ అవుతున్నాడట.
ఇప్పటివరకూ సుకుమార్ నాలుగు కథలు చెప్పగా.. మహేష్ ఒక్కటి దానికి కూడా ఇంప్రెస్ అవలేదట. దాంతో మహేష్ ఇప్పుడు కొత్త దర్శకులు సందీప్ రెడ్డి వంగా, అజయ్ భూపతిలు చెబుతున్న కథలను వింటున్నాడట. సందీప్ రెడ్డి చెప్పిన కథను ఆల్రెడీ మహేష్ సైన్ చేశాడని తెలుస్తోంది. సో, మహేష్ బాబు ప్లాన్ ఏంటంటే.. సందీప్ తన బాలీవుడ్ ప్రొజెక్ట్ ఫినిష్ చేసుకొని వచ్చేసరికి ఎలాగూ తన మహర్షి విడుదలైపోతుంది కాబట్టి.. ఆ తర్వాత సందీప్ వంగతో ఒక సినిమా చేయాలనుకొంటున్నాడట. ఇదే జరిగితే సుకుమార్ గారికి హస్తం ఇచ్చినట్లేనా లేక సందీప్ సినిమా తర్వాత సుకుమార్ సినిమా చేస్తాడా అనేది తెలియాల్సి ఉంది. పాపం సుక్కు... అంత పెద్ద ఇండస్ట్రీ హిట్ కొట్టినా మహేష్ బాబుని మెప్పించడానికి కష్టాలు పడుతున్నాడు... ప్చ్...