పెద్ద సినిమాలకి పెద్ద ప్రొడ్యూసర్స్ ఉంటారు కాబట్టి వారికి థియేటర్స్ సమస్య ఉండదు. కానీ సినిమాల దగ్గరకి వచ్చేసరికి అలా ఉండదు. చాలా కష్టపడి, ఇష్టపడి సినిమా తీస్తే సెన్సార్ సమస్యలు, రిలీజ్ సమస్యలు.. థియేటర్స్ సమస్యలు. సరే కదా అని అవి దాటుకుని ముందుకు వెళ్లి సినిమాకు మంచి టాక్ వస్తే వారం వరకే థియేటర్స్ లో ఉంటాయి. అందుకంటే ప్రతి వారం సినిమాలు రిలీజ్ అవుతుంటాయి కాబట్టి. చిన్న సినిమాలకి శాటిలైట్ రైట్స్ కూడా రావు. పెద్ద హిట్ అయితే తప్ప. ఇలా చిన్న సినిమాలకి అడుగడుగునా ఇబ్బందులే.
ఈ నేపథ్యంలో ఈ సమస్యలపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో హీరో - డైరెక్టర్ - ప్రొడ్యూసర్ కోవెర స్పందించారు. ‘యు’ తో తెలుగు తెరకు పరిచయం అవుతున్న ఈ హీరో కమ్ డైరెక్టర్ చిన్న సినిమాలకి ఎన్ని ఇబ్బందులు ఉంటాయో చెప్పారు. చిన్న సినిమాలకి ఇంకా ఫ్యూచర్ లో లైఫ్ ఉండదు అని అన్నారు. డిస్ట్రిబ్యూటర్స్ దగ్గరకు వెళ్లి మా సినిమాని రిలీజ్ చేయండి అంటే మీరే చేసుకోండి అంటున్నారు. పెద్ద సినిమాలకి అయితే క్యూబ్స్ వాళ్లకి రెంట్ థియేటర్స్ వారు లేదా డిస్ట్రిబ్యూటర్స్ వారు ఇచ్చేస్తారు. కానీ చిన్న సినిమా అనేపాటికి వాళ్లే ఆ రెంట్స్ పే చేసుకోవాల్సిన పరిస్థితి.
ఎంతో కష్టపడి సినిమా తీసి ప్రేక్షకులకి చూపిద్దాం అంటే ఆ అవకాశం కూడా మాకు ఇవ్వట్లేదు. అయితే దీని పరిష్కారం ఏంటి అని ఆ యాంకర్ అడగగా...పెద్ద సినిమాలకి సీజన్స్ ఉన్నట్టు అంటే సంక్రాంతి.. దసరా.. క్రిస్మస్ సీజన్స్ ఉన్నట్టు చిన్న సినిమాలకి కూడా ఒక సీజన్ ఇస్తే బాగుంటది. ఫిబ్రవరి నెల లాగా మాకు ఒక నెల ఇస్తే మేము బతుకుతాం.. చిన్న సినిమాలు బతుకుతాయి అని ఆయన అన్నారు. పెద్ద సినిమాలతో మేము పోటీ పడలేకపోతున్నాం. ఒకవేళ వెళ్లినా చేతులు కాల్చుకుంటున్నారు. సో చిన్న సినిమాలకి ఒక్క సీజన్ ఇవ్వండి అని రిక్వెస్ట్ చేస్తున్నాడు ఈ దర్శకుడు కమ్ హీరో కోవెర.