మొన్నటివరకు టాలీవుడ్ లో కామెడీ హార్రర్స్ ట్రెండ్ అయితే నిన్నటివరకు బయోపిక్స్ ట్రెండ్ గా నడిచాయి. ఇక రానున్న రోజుల్లో ఈ ట్రెండ్ కూడా మారి కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టనున్నారు మేకర్స్. అదే పీరియాడిక్ మూవీస్. మనకి ఇవేమి కొత్త కాదు. రీసెంట్ గా #RRR కూడా పీరియాడిక్ కథతోనే తెరకెక్కుతుంది. ఇప్పుడు మరో సినిమా కూడా పీరియాడిక్ కథతో రూపొందనుంది.
ఇందులో ఎటువంటి అబద్దం లేదు. ఇది నిజం. దగ్గుబాటి రానా హీరోగా ఓ పీరియాడిక్ కథ త్వరలోనే తెరకెక్కనుంది. ఈ విషయాన్ని దర్శకుడు వేణు ఉడుగుల స్పష్టం చేశాడు. ‘నీది నాది ఒకే కథ’ సినిమాతో పాపులర్ అయిన ఈ డైరక్టర్.. విరాటపర్వం సినిమా 50 ఏళ్ల టైమ్ గ్యాప్ లో జరుగుతుందని చెబుతున్నాడు.
వీరి కాంబినేషన్ లో సినిమా వస్తుందని తెలిసినా అది పీరియాడిక్ మూవీ అని ఎవరికి తెలియదు. ఇప్పటివరకు వచ్చిన పీరియాడిక్ సినిమాలకు భిన్నంగా ఇది ఉంటుందని చెబుతున్నారు. రానాకి జోడిగా సాయి పల్లవిని సంప్రదిస్తున్నట్లు సమాచారం. ఆమె ఓకే చెప్పితే త్వరలోనే సెట్స్ మీదకు తీసుకుని వెళ్లనున్నారు. మొదట ఈసినిమాకి శర్వానంద్ ని అనుకున్నారు. కానీ శర్వా ఏ విషయం చెప్పకపోవడంతో ఇప్పుడు ఆ కథ రానా దగ్గరకు వెళ్ళింది. కథ విన్న రానా వెంటనే ఓకే చేసేశాడట. స్క్రిప్ట్ వర్క్ కూడా దాదాపు ఫినిష్ అవ్వడంతో త్వరలోనే అధికారికంగా అనౌన్స్ చేయనున్నారు అని తెలుస్తుంది.