టాలీవుడ్‌కి ఈ మధ్య పైరసీతో పాటు లీకుల బెడద వెంటాడుతోంది. చిన్న సినిమాలు కాకుండా పెద్ద సినిమాలు.. అది కూడా సినిమా అంతా లీక్ అవుతుండటం అంతా గమనిస్తూనే ఉన్నారు. క్రేజీ కాంబినేషన్స్‌తో తెరకెక్కుతున్న భారీ చిత్రాలు లీకులు అవుతున్నాయి. ‘అత్తారింటికి దారేది’ సినిమాలో కొన్ని సీన్స్ బయటికి రావడం.. ‘అరవింద సమేత’ లో కీలక ఫైట్ సీన్ లీక్ అవ్వడం.. ‘గీత గోవిందం’ సినిమా నుంచి కూడా కొన్ని కీలకమైన సన్నివేశాలు..‘ట్యాక్సీవాలా’ సినిమా సినిమా లీక్ అవ్వడంతో టాలీవుడ్ మొత్తం అలెర్ట్ అయింది. అయినా కానీ లీకులు ఆగడంలేదు.
రీసెంట్ గా మహేష్ బాబు నటిస్తున్న ‘మహర్షి’కి కూడా ఈ లీక్ బెడద తప్పలేదని సమాచారం. ఈచిత్రంలో ఓ సాంగ్ బిట్ ఆన్ లైన్లోకి వచ్చేసినట్లు తెలుస్తోంది. మరి ఇది ఎలా బయటికి వచ్చిందో తెలియదు కానీ టీం మొత్తం అలెర్ట్ అవ్వడంతో ఆ సాంగ్ ను ఆన్ లైన్ నుండి తీసేస్తున్నట్టు సోషల్ మీడియాలో ఒకటే వార్తలు. అయితే మరి దీని గురించి ఎక్కడ లీక్ అయినట్టు ప్రచారం జరగలేదు. కానీ లీక్ అయిందని అంటున్నారు.
ముందుగా అలెర్ట్ అవ్వడంతో ఎటువంటి ప్రమాదం లేదని చెబుతున్నారు. దాంతో చిత్ర దర్శక నిర్మాతలు యూనిట్‌కు స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారట. ఎడిటింగ్ రూంలో భద్రత పెంచి.. సెల్ ఫోన్స్‌ని అనుమతించట్లేదట. రీసెంట్ గా హైదరాబాద్ లో ఒక షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా జనవరిలో మరో షెడ్యూల్ ని స్టార్ట్ చేయనుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. మహేష్‌కి జోడిగా పూజా హెడ్జ్ నటిస్తుంది.