Advertisementt

యంగ్ హీరోయిన్‌, హీరోలకు సహకరించడం లేదట!

Thu 27th Dec 2018 11:50 PM
mehreen,heroes,complaint,producer,mehreen heroine,tollywood,mehreen kaur  యంగ్ హీరోయిన్‌, హీరోలకు సహకరించడం లేదట!
Young Heroine Chapter Close in Tollywood యంగ్ హీరోయిన్‌, హీరోలకు సహకరించడం లేదట!
Advertisement
Ads by CJ

ప్రస్తుతం ఇండస్ట్రీలో మెహ్రీన్‌ చాప్టర్ అనే మాట మాత్రం బాగా వినబడుతుంది. మొన్నటికిమొన్న పారితోషికం విషయంలో మెహ్రీన్ పై ఫైర్ అయిన ఒక నిర్మాత ఏకంగా ఫిలిం ఛాంబర్‌లో ఆమెపై కంప్లైంట్ చేశాడు. అసలే సినిమాల ప్లాప్స్‌తో కష్టాల్లో ఉన్న మెహ్రీన్‌కి ఇప్పుడు సినిమా కష్టాలంటారే... అలా కష్టాలు మొదలయ్యాయి. ఇంతకీ మెహ్రీన్ సినిమా కష్టాలంటే... మెహ్రీన్‌కి ఎఫ్ 2 తర్వాత ఒక్క సినిమా కూడా చేతిలో లేదు. కారణం మెహ్రీన్‌కి లక్కు లేకో... మరేదన్నానో కాదు... ఆమెకి ఆఫర్స్ ఇవ్వొద్దని హీరోలు దర్శక నిర్మాతల మీద ఒత్తిడి తేవడంతోనే మెహ్రీన్ చేతిలో ఫ్యూచర్ ప్రాజెక్టులు లేకపోవడానికి కారణమట.

ఇంతకీ హీరోలకు మెహ్రీన్ మీద ఎందుకు మండింది అంటే... మెహ్రీన్ చేసిన సినిమాల్లో హీరోలకు షూటింగ్ విషయంలో సహకరించకుండా.. కాస్త బెట్టు చేసేదని... దర్శకనిర్మాతలకు పెట్టే కండీషన్స్, అలాగే సెట్స్‌లో హీరోలకు కనీస మర్యాద ఇవ్వకుండా పొగరు చూపించడంతో... ఆమెతో సినిమాలు చేసిన హీరోలు మరొక అవకాశం ఆమెకి ఇచ్చేది లేదని.. డిసైడ్ అయినట్లుగా వార్తలొస్తున్నాయి. మరి టాప్ హీరోయిన్స్ కూడా సినిమా షూటింగ్స్‌లో డీసెంట్ గా ఉండి.. తమ పని తాము చేసుకుని అవకాశాల మీద అవకాశాలు పడుతుంటే.. చేతిలో సినిమాలు అంతంత మాత్రంగా ఉండి... అదృష్టం కలిసిరాక ఒక్క బ్లాక్ బస్టర్ కొట్టని మెహ్రీన్ కి ఇంత పొగరు అవసరమా? అంటూ సోషల్ మీడియాలో నెటిజెన్స్ సెటైర్స్ వేస్తున్నారు. 

ఏమైనా F2 తర్వాత మెహ్రీన్‌కి ఒక్క అవకాశము లేదు. మరి ఇంతకుముందే కవచం ప్రమోషన్స్ విషయంలో కాజల్ కి మెహ్రీన్ కి మధ్య గొడవ జరగడం వల్లే కవచం ప్రమోషన్స్ లో మెహ్రీన్ కనబడలేదనే న్యూస్ తో పాటుగా.. రెమ్యునరేషన్ విషయంలో మెహ్రీన్ ప్రవర్తన, లేటెస్ట్ గా హీరోల పట్ల మెహ్రీన్ ప్రవర్తన వింటుంటే.. మెహ్రీన్ ఇక తట్టా బుట్టా సర్దుకోవాలేమో అన్నట్లుగా ఉంది.

Young Heroine Chapter Close in Tollywood:

Producer Complaint on Heroine Mehreen

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ