ఈ సంక్రాంతికి మూడు సినిమాలు రిలీజ్ అవుతున్నా అందరి చూపు ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ పైనే ఉంది. ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం కోసం రెండు రాష్ట్రాల ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఆయన జీవితం గురించి తెలుసుకోవాలని ఎంతో ఆతృతతో ఉన్నారు. ఇప్పుడున్న యూత్ కూడా ఆయన జీవితం గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారు. మరి ఆయన జీవితాన్ని ఎంత లోతుగా చూపించి ఉంటారు అనేదాని మీద అనుమానాలు కూడా ఉన్నాయి.
ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఇందులో 12 రీమిక్స్ సాంగ్స్, 63 గెటప్పులతో ఎన్టీఆర్ పాత సినిమాలలోని బిట్లు అన్ని కలిపితే ఎంత లేదన్నా గంటన్నర పైగా నిడివి వీటి కోసం ఉంటుందని టాక్. మరి మిగిలిన గంటలో ఏమి చూపించారనేది చూడాలి. కథ తక్కువగా ఉండి గెటప్పులు ఎక్కువగా ఉంటే ప్రేక్షకులు ఈ సినిమా అంగీకరిస్తారా?. కేవలం రీమిక్స్‌లతో నెట్టేస్తే సరిపోతుందా?. నిజంగా అదే చూపించాల్సి వస్తే.. దానికి సినిమా అవసరం లేదు. యూట్యూబ్ చాలనేది కొందరి అభిప్రాయం.
మరి దీని కోసం క్రిష్ ఎంటువంటి జాగ్రత్తలు తీసుకున్నాడో చూడాలి. కేవలం గెటప్స్‌తో.. రెండు మూడు సాంగ్స్ తో చూపిస్తే ప్రేక్షకులు మొహమాటం లేకుండా సినిమాను తిరస్కరిస్తున్నారు. అంతేకాదు కథానాయకుడి సినిమా చివరిలో మహానాయకుడు గురించి లీడ్ వేయాలి.. లేకపోతే మహానాయకుడిని చూసే అవకాశాలు తక్కువ. మరి క్రిష్ ఏం చేస్తాడో చూడాలి. బయోపిక్ అంటే ప్రేక్షకులు చాలా ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వాలి అప్పుడే హిట్ అవుతుంది. ‘మహానటి’ విషయంలో అదే జరిగింది. అందుకే ఆ సినిమా హిట్ అయింది. మరి ఈ సినిమా ఎటువంటి రిజల్ట్‌ని అందుకుంటుందో వెయిట్ అండ్ సీ..