Advertisementt

`అర్జున్‌రెడ్డి` వెనక్కుత‌గ్గాడోచ్‌!

Thu 27th Dec 2018 03:08 PM
vijay deverakonda,83,kapil dev,ranveer singh,karan johar,jhanvi kapoor,kabeer khan,kapil dev biopic,  `అర్జున్‌రెడ్డి` వెనక్కుత‌గ్గాడోచ్‌!
vijay devarakonda says no to 83 `అర్జున్‌రెడ్డి` వెనక్కుత‌గ్గాడోచ్‌!
Advertisement
Ads by CJ

టాలీవుడ్ తాజా సంచ‌ల‌నం విజ‌య్ దేవ‌ర‌కొండ‌. `అర్జున్‌రెడ్డి` సినిమాతో క్రేజీ స్టార్‌గా ఎదిగిన విజ‌య్ త‌న కెరీర్‌ని చాలా జాగ్ర‌త్త‌గా ప్లాన్ చేసుకుంటూ వ‌రుస విజ‌యాల్ని త‌న ఖాతాలో వేసుకుంటున్నాడు. ఇటీవ‌ల వ‌చ్చిన బ్యాక్ టు బ్యాక్ హిట్స్ గీత గోవిందం, టాక్సీవాలా చిత్రాల‌తో త‌న మార్కెట్‌ను పెంచుకున్న విజ‌య్ త్వ‌ర‌లో బాలీవుడ్‌కు వెళ్లేందుకు సిద్ధ‌మ‌వుతున్న విష‌యం తెలిసిందే. బాలీవుడ్ వెళ్లాల‌ని భావిస్తున్న విజ‌య్‌కి ఈ మ‌ధ్య ఓ భారీ ఆఫ‌ర్ త‌గిలింది. అదే `83`. క‌పిల్‌దేవ్ నేతృత్వంలోని భార‌త జ‌ట్టు మ‌న ఇండియాకు వ‌ర‌ల్డ్ క‌ప్‌ని తొలిసారి తెచ్చిపెట్టిన మ్యాచ్ నేప‌థ్యంలో ఈ చిత్రాన్నిక‌బీర్‌ఖాన్ రూపొందించ‌బోతున్నాడు. 

క‌పిల్‌దేవ్ పాత్ర‌లో ర‌ణ్‌వీర్‌సింగ్ ఇప్ప‌టికే ఖ‌రార‌య్యాడు. జ‌న‌వ‌రి నుంచి సెట్స్‌పైకి రాబోతున్న ఈ చిత్రంలోని  క్రికెట‌ర్ కృష్ణమాచారి శ్రీ‌కాంత్ పాత్ర కోసం విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను బాలీవుడ్ వ‌ర్గాలు సంప్ర‌దించాయ‌ట‌. అయితే కేవలం చిన్న పాత్ర ద్వారా బాలీవుడ్‌కు ప‌రిచ‌యం ఇష్టం లేని విజ‌య్ దేవ‌ర‌కొండ వ‌చ్చిన అవ‌కాశాన్ని సున్నితంగా తిర‌స్క‌రించి వెన‌క్కుత‌గ్గిన‌ట్లు తాజా స‌మాచారం. పూర్తి స్థాయి పాత్ర‌తో బాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం కావాల‌న్న‌ది విజ‌య్ దేవ‌ర‌కొండ‌ ప్లాన్‌.

ఆ ప్లాన్ ప్ర‌కార‌మే త‌నను వెతుక్కుంటూ వ‌చ్చిన ఆఫ‌ర్‌ను వ‌దులుకున్నాడ‌ని తెలిసింది. బాలీవుడ్ క్రేజీ ద‌ర్శ‌క‌నిర్మాత‌ క‌ర‌ణ్ జోహార్ గ‌త కొన్ని నెల‌లుగా విజ‌య్ దేవ‌ర‌కొండ‌ని బాలీవుడ్‌కు ప‌రిచ‌యం చేయాల‌ని ప్లాన్ చేస్తున్నాడంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ మ‌ధ్య కాఫీ విత్ క‌ర‌ణ్ షోలో జాన్వీ కూడా విజ‌య్‌తో న‌టించాల‌ని వుంద‌ని త‌న మ‌న‌సులో మాట‌ని బ‌య‌ట పెట్టేసింది. దీంతో క‌ర‌ణ్ జోహ‌ర్ వీళ్లిద్ద‌రినీ క‌లిపి సినిమా చేయాల‌నుకుంటున్నాడ‌ట‌. ఇప్ప‌టికే విజ‌య్‌తో ఓ ద‌ఫా క‌ర‌ఫ్ సంప్ర‌దింపులు జ‌రిపాడ‌ని, ఈ సినిమా ద్వ‌రానే బాలీవుడ్‌కు విజ‌య్ దేవ‌ర‌కొండ బాలీవుడ్‌కు ప‌రిచ‌యం కావాల‌నుకుంటున్నాడ‌ని తాజా అప్‌డేట్‌.  

vijay devarakonda says no to 83:

vijay deverakonda step back

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ