Advertisementt

‘యన్.టి.ఆర్’.. ఓపెనింగ్ సీన్ ఇదేనట!

Wed 26th Dec 2018 11:31 PM
ntr biopic,emotion scene,balakrishna,basavatarakam,ntr kathanayakudu,opening scene  ‘యన్.టి.ఆర్’.. ఓపెనింగ్ సీన్ ఇదేనట!
This is the First Scene in NTR Biopic 1st Part ‘యన్.టి.ఆర్’.. ఓపెనింగ్ సీన్ ఇదేనట!
Advertisement
Ads by CJ

స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘యన్.టి.ఆర్’. సినిమా రిలీజ్ దగ్గర పడడంతో బాలకృష్ణ - క్రిష్ ప్రమోషన్స్ మీద ప్రమోషన్స్ చేస్తున్నారు. రీసెంట్‌గా జరిగిన ఆడియో ఫంక్షన్‌లో రిలీజ్ చేసిన ట్రైలర్‌కు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమాపై అంచనాలు ఉండడంతో సినిమా ఎలా ఉండబోతుంది? అసలు ఎన్టీఆర్‌ని ఎలా చూపిస్తున్నారు? అన్న ప్రశ్నలు మొదలయ్యాయి.

ఈ నేపధ్యంలో రీసెంట్‌గా ‘కథానాయకుడు’ సినిమా ఓపెనింగ్ సీన్ ఎలా ఉండబోతుందని చర్చ జరిగింది. తాజా సమాచారం ప్రకారం సినిమా ఓపెనింగ్ సీన్ చాలా ఎమోషనల్‌గా ఉంటుందని చెబుతున్నారు. ఓపెనింగ్ సీన్ స్టార్ట్ అవ్వడమే హాస్పిటల్‌లో ఎన్టీఆర్ భార్య బసవతారకం‌పై ఓపెన్ అవుతుందట. బసతారకం క్యాన్సర్‌తో పోరాడే సీన్‌తో క్రిష్ ఈ సినిమాని ప్రారంభించినట్లుగా తెలుస్తోంది.

బసవతారకం పరిస్థితి చూసి అక్కడే హాస్పిటల్ లో చైర్ మీద ఎన్టీఆర్ కూలబడిపోయి అసలు తాను స్టార్ హీరోగా ఎలా ఎదిగాడు అనేది ఆలోచించుకుంటున్నపుడు ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తాడని చెబుతున్నారు. ఇలా ఓపెనింగ్ సీనే ఎమోషనల్ గా చూపిస్తే ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారని క్రిష్ భావిస్తున్నాడట. రెండు పార్టులుగా తెరకెక్కిన ఈచిత్రం మొదటి పార్ట్ ‘కథానాయకుడు’ జనవరి 9న .. ‘మహానాయకుడు’ ఫిబ్రవరి 7న రిలీజ్ అవుతున్నాయి.

This is the First Scene in NTR Biopic 1st Part :

NTR Biopic starts with Emotion Scene 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ