Advertisementt

‘దేవ్’ డిటైల్స్ వచ్చేశాయ్

Wed 26th Dec 2018 10:03 PM
dev,dev movie,shooting completed,karthi,rakul preet singh,dev telugu movie  ‘దేవ్’ డిటైల్స్ వచ్చేశాయ్
Dev Movie Latest Update ‘దేవ్’ డిటైల్స్ వచ్చేశాయ్
Advertisement
Ads by CJ

కార్తి, ర‌కుల్ ప్రీత్‌ల ‘దేవ్’ షూటింగ్ పూర్తి.. సంక్రాంతికి ఆడియో, ఫిబ్ర‌వ‌రిలో సినిమా.. 

కార్తి, ర‌కుల్ ప్రీత్ సింగ్ జంట‌గా న‌టిస్తున్న దేవ్ సినిమా షూటింగ్ పూర్త‌యింది. ఈ చిత్ర పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు మొద‌ల‌య్యాయి. రాజ‌త్ ర‌విశంక‌ర్ ఈ యాక్ష‌న్ ఫ్యామిలీ డ్రామాను తెర‌కెక్కిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన దేవ్ ఫ‌స్ట్ లుక్ కు అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. సంక్రాంతి కానుక‌గా దేవ్ ఆడియోను విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు చిత్ర‌యూనిట్. సినిమా ఫిబ్ర‌వ‌రిలో విడుద‌ల కానుంది. ఈ చిత్రంలో ప్ర‌కాశ్ రాజ్, రమ్య‌కృష్ణ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. నిక్కి గర్లానీ సెకండ్ హీరోయిన్ గా న‌టిస్తున్నారు. చెన్నై, హిమాల‌యాస్, హైద‌రాబాద్, ముంబైలోని అంద‌మైన ప్ర‌దేశాల్లో ఈ చిత్రాన్ని చిత్రీక‌రించారు ద‌ర్శ‌కుడు ర‌జ‌త్. హ‌రీష్ జ‌య‌రాజ్ సంగీతం అందిస్తుండ‌గా.. వేల్రాజ్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. ప్రిన్స్ పిక్చ‌ర్స్ సంస్థ దేవ్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రిల‌యన్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని స‌మ‌ర్పిస్తుంది. 

Dev Movie Latest Update:

Karthi and Rakul Preet’s ‘Dev’ shooting completed, audio for Sankranti and release in February

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ