Advertisementt

అఖిల్ తొందరపడుతున్నాడా ?

Wed 26th Dec 2018 05:04 PM
akhil akkineni,mr majnu,venky atluri,nagarjuna  అఖిల్ తొందరపడుతున్నాడా ?
Akhil is in Hurry for Mr,Majnu Release అఖిల్ తొందరపడుతున్నాడా ?
Advertisement
Ads by CJ

అక్కినేని మూడోతరం వారసుడు అఖిల్ కి ముందు నుంచీ ఆత్రం ఎక్కువ.. ఆ ఆత్రం కారణంగా పర్సనల్ లైఫ్ మాత్రమే కాదు, తన కెరీర్ ను కూడా కష్టాల్లో నెట్టుకొంటున్నాడు. 22 ఏళ్లకే పెళ్లి చేసుకోవాలన్న తపనతో వయసులో తనకంటే పెద్దదైన శ్రియాభూపాల్ తో నిశ్చితార్గం చేసుకొని తర్వాత మెల్లగా తాను తీసుకొన్న తొందరపాటు నిర్ణయాన్ని గ్రహించి పెళ్లి క్యాన్సిల్ చేసుకొన్నాడు. ఆ తర్వాత శ్రియా భూపాల్ మరొకర్ని ఘనంగా పెళ్లాడిందనుకోండి అది వేరే విషయం అనుకోండి. ఇప్పుడు అదే తరహాలో అఖిల్ మళ్ళీ తన కెరీర్ విషయంలో కంగారుపడుతున్నాడు. తొలిప్రేమతో హిట్ అందుకొన్న వెంకీ అట్లూరి దర్శకత్వంలో అఖిల్ హీరోగా మిస్టర్ మజ్ను అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం కోసం అక్కినేని అభిమానుల్లో కానీ.. ఇండస్ట్రీ వర్గాల్లో కానీ ఎలాంటి కంగారు లేదు. 

కానీ.. అక్కినేని అఖిల్ మాత్రం సినిమా విడుదల విషయంలో తెగ కంగారుపడిపోతున్నాడట. ఆఖరికి స్వయంగా నాగార్జున వచ్చి ఎందుకురా కంగారు, ఫిబ్రవరిలో రిలీజ్ చేద్దామని చెబుతున్నా కూడా జనవారిలోనే రిలీజ్ చేయాలని మంకుపట్టు పడుతున్నాడట. దాంతో అఖిల్ ను కన్విన్స్ చేయలేని నాగార్జున కూడా మిస్టర్ మజ్ను రిలీజ్ విషయంలో ఇన్వాల్వ్ అవ్వడం మానేశాడట. హలో విషయంలో కూడా అఖిల్ ఇలా ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యి.. రిలీజ్ విషయంలో కంగారు పడడం వల్లే.. సోలో రిలీజ్ దొరికితే హిట్ అయ్యే హలో అనవసరంగా అప్పటికే ఫుల్ ఫామ్ లో ఉన్న నాని ఎం.సి.ఏ సినిమాకి పోటీగా విడుదలై కమర్షియల్ ఫ్లాప్ అయ్యింది. 

మిస్టర్ మజ్ను షూటింగ్ ఇప్పటికీ పెండింగ్ ఉంది. కొంత టాకీ పార్ట్ తోపాటు.. పాటల చిత్రీకరణ కూడా పూర్తికావాల్సి ఉంది. కానీ.. అఖిల్ జనవరి 26న విడుదల అని ప్రకటన ఇప్పించేశాడు. దాంతో టీం అందరూ కంగారుకంగారుగా ఫినిషింగ్ పనుల్లో ఉన్నారట. ఇంత కంగారుపడి.. అంత కంగారుగా మిస్టర్ మజ్ను చిత్రాన్ని విడుదల చేయాల్సిన అవసరం అఖిల్ కి ఏముందో అర్ధం కావడం లేదు. ఇంకోసారి ఆలోచించు అఖిల్ బాబు.. ఎందుకంటే ఇప్పుడు రిలీజ్ డేట్ కంటే రిజల్ట్ నీకు చాలా అవసరం. 

Akhil is in Hurry for Mr,Majnu Release:

Why Akkineni Akhil is so worried about the release date of Mr.Majnu 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ