సాధారణంగా సినిమా ఇండస్ట్రీ అనేది హీరోల డామినేషన్ ఉండేది. ఏదైనా హిట్ చిత్రం వస్తే దీనిని అందులో నటించిన స్టార్ కాకుండా ఎవరూ ఆ పాత్రను చేయలేరనే భజన మామూలుగా ఉండేదే. కానీ అదే సమయంలో హీరోయిన్ల విషయంలో మాత్రం అందరు బహిరంగ చర్చలు పెడుతూ ఫలానా హీరోయిన్ అయితే ఇంకా బాగుండేదని అంటూ ఉంటారు. ఏదో ‘మహానటి, ఫిదా’ వంటివి అరుదుగా వస్తూ ఉంటాయి.
ఇక విషయానికి వస్తే తాజాగా కాఫీ విత్ కరణ్ ప్రోగ్రాంలో ప్రభాస్, రాజమౌళి, రానాలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినిమాకి ఆయువు పట్టుగా నిలిచిన బాహుబలి, భళ్లాలదేవ, దేవసేన పాత్రలను వేరే వారు చేస్తే ఎలా ఉంటుంది అనే టాపిక్ కూడా వచ్చింది. ప్రభాస్, రానాలతో పాటు రాజమౌళి కూడా ప్రభాస్‌కి తల్లిగా, భార్యగా అదరగొట్టిన అనుష్క పాత్రను బాలీవుడ్‌లో తీస్తే ఎవరు బాగుంటారు? అనే ప్రశ్నకు దీపికాపడుకోనే అని సమాధానం చెప్పారు.
అదే బాహుబలిగా నటించిన ప్రభాస్, భళ్లాలదేవగా నటించిన రానాలను మాత్రం వారు లేకుండా ఆ పాత్రలను ఊహించలేమని తేల్చడం అన్యాయం. ప్రతి ఒక్కరూ అనుష్క నుంచి తమన్నా, సత్యరాజ్, నాజర్ వంటి వారందరు సమిష్టిగా తమ పాత్రను పండించబట్టే ఈ చిత్రం మరుపురానిదిగా మిగిలిందని, ఎవరో ఒకరి మీద ఆధారపడితే ఈ రిజల్ట్ వచ్చేది కాదన్నది మాత్రం అక్షరసత్యం.