Advertisementt

పూరి జగన్‌కి హీరో దొరికేశాడోచ్..!!

Wed 26th Dec 2018 08:09 AM
puri jagannadh,next movie,hero,ram,confirmed  పూరి జగన్‌కి హీరో దొరికేశాడోచ్..!!
Puri Jagannadh Next Movie Confirmed పూరి జగన్‌కి హీరో దొరికేశాడోచ్..!!
Advertisement
Ads by CJ

నటుడిగా రామ్ మంచి సక్సెస్ నే అందుకున్నాడు కానీ అతని సినిమాలే సక్సెస్ అవ్వట్లేదు. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా ఇంప్రెస్స్ చేసే రామ్ కి  ‘నేను శైలజ’ తరువాత ఇంతవరకూ హిట్ లేదు. పైగా సినిమాకి సినిమాకి చాలా గ్యాప్ తీసుకుంటాడు. ‘హలో గురు ప్రేమ కోసమే’ తరువాత కొంచెం గ్యాప్ తీసుకుని పూరి జగన్నాథ్ తో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు రామ్.

రీసెంట్ గా పూరి జగన్నాథ్ రామ్ కి ఒక కథ వినిపించగా, ఆ కథ రామ్ కి బాగా నచ్చేసింది. దాంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని తెలుస్తుంది. ప్రస్తుతం పూరి స్క్రిప్ట్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నట్టు సమాచారం. జనవరి నెలాఖరు నుండి షూటింగ్ స్టార్ట్ చేసి మే లేదా జూన్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. పూరి తో రామ్ చేయడం ఇదే మొదటిసారి. పూరి.. రామ్ ని సరికొత్తగా చూపించనున్నాడని ఫిలింనగర్ టాక్. ఈసినిమా  పూరి సొంత బ్యానర్లో రూపొందనుంది. 

మరి రామ్ కి జోడి ఎవరు? విలన్ ఎవరు? ఇతర నటీనటులు ఎవరు? అన్న విషయాలు మాత్రం త్వరలోనే ప్రకటించనున్నారు. నిజానికి పూరి తన తనయుడుతోనే మరో సినిమా చేయాల్సివుంది కానీ సడన్ గా రామ్ వచ్చాడు. ఈ సినిమా తరువాత పూరి తన తనయుడు ఆకాశ్ హీరోగా మరో సినిమా చేయనున్నాడు. 

Puri Jagannadh Next Movie Confirmed:

Puri Jagan next Film Hero Is Ram

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ