Advertisementt

నాని.. ఈ దర్శకుడ్ని హోల్డ్‌లో పెట్టేస్తాడా?

Tue 25th Dec 2018 09:21 PM
nani,hanu raghavapudi,padi padi leche manasu,hold,sharwanand,director next film  నాని.. ఈ దర్శకుడ్ని హోల్డ్‌లో పెట్టేస్తాడా?
Doubts on Nani and This Director Film నాని.. ఈ దర్శకుడ్ని హోల్డ్‌లో పెట్టేస్తాడా?
Advertisement
Ads by CJ

దర్శకుడు హను రాఘవపూడి ఇప్పటివరకు ఒక్క బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకోనేలేదు. ఆయన తీసే ప్రేమ కథా చిత్రాలు మంచి ఫీల్ గుడ్ మూవీస్ లా ఉంటాయంటారు కానీ.. ఆ సినిమాలు మాత్రం సూపర్ డూపర్ హిట్ అయిన సందర్భాలు లేవు. గత ఏడాది లై సినిమాతో డిజాస్టర్ కొట్టిన హను రాఘవపూడి ఈ ఏడాది పడి పడి లేచె మనసుతో మళ్లీ యావరేజే అందుకున్నాడు కానీ.. హిట్ మాత్రం కొట్టలేకపోయాడు. ఆయన మొదటి సినిమా అందాల రాక్షసి దగ్గరనుండి అదే వరస. రెండో సినిమా కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమా హిట్ అన్నప్పటికీ... యావరేజ్ కలెక్షన్స్ తోనే సరిపెట్టుకుంది.

తాజాగా పడి పడి లేచె మనసు కూడా యావరేజ్ టాక్‌తో యావరేజ్ కలెక్షన్స్‌తో రన్ అవుతుంది. సినిమాలో ఫస్టాఫ్ డీసెంట్‌గా కాస్త బాగున్నప్పటికీ... సెకండాఫ్ తట్టుకోవడం కష్టంగా ఉందని ప్రేక్షకులే చెబుతున్నారు. శర్వానంద్, సాయి పల్లవిల నటన సూపర్‌గా ఉన్నప్పటికీ.. సినిమా కథ రొటీన్ వలన సినిమా హిట్ అవ్వలేకపోయింది. ఇక హను రాఘవపూడి లై సినిమా డిజాస్టర్ అప్పుడే... ఆయనికి దర్శకుడిగా అవకాశాలు కష్టమే అనే టాక్ వస్తే.. శర్వానంద్.. హనుని నమ్మి మళ్ళీ అవకాశమిచ్చారు. అయితే హను రాఘవపూడి మంచి మాస్ మసాలా కథతో వస్తే.. శర్వానంద్ మాత్రం లవ్ స్టోరీ చేద్దామని చెబితే హను లవ్ స్టోరీతో సినిమా చేసి శర్వాకి యావరేజ్ ఇచ్చాడు.

మరి ఇప్పుడు కూడా ఈ దర్శకుడికి ఛాన్స్ లు వచ్చే ఛాన్స్ ఉందంటారా... ఏమో చెప్పలేం. ఎందుకంటే హను రాఘవపూడి శర్వానంద్ తర్వాత నేచురల్ స్టార్ నానితో సినిమా చెయ్యాల్సి ఉంది. కానీ.. ఇప్పుడు నాని ఛాన్స్ ఇస్తాడా అంటే... చెప్పలేం. ఎందుకంటే ప్రస్తుతం జెర్సీ సినిమా చేస్తున్న నాని, విక్రమ్ కుమార్‌తో మరో సినిమా చేయాల్సి ఉంది. కానీ.. విక్రమ్ కుమార్ సినిమా వచ్చే ఏడాది ద్వితీయార్ధానికి కానీ పూర్తి కాదు.. ఈ లోపు నాని హనుని హోల్డ్‌లో పెట్టినా పెట్టొచ్చు. తర్వాత మరో దర్శకుడికి కమిట్ అయినా అవ్వచ్చనే టాక్ ఫిలింసర్కిల్సో వినబడుతుంది. 

Doubts on Nani and This Director Film:

Will Nani accept this Director film

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ