Advertisementt

బ‌న్నీకి ఇప్ప‌టికి క్లారిటీ వ‌చ్చింది!

Tue 25th Dec 2018 07:56 PM
bunny,allu arjun,parasuram,geetha arts,allu arjun,geetha govindam,trivikram  బ‌న్నీకి ఇప్ప‌టికి క్లారిటీ వ‌చ్చింది!
bunny greensignal to parasuram బ‌న్నీకి ఇప్ప‌టికి క్లారిటీ వ‌చ్చింది!
Advertisement
Ads by CJ

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇన్నేళ్ల కెరీర్‌లో ఈ ఏడాది క‌న్‌ఫ్యూజ్ అయినంత‌గా ఏ రోజూ క‌న్‌ఫ్యూజ్ కాలేదు. వ‌రుస ఫ్లాపులు..మారిన తెలుగు ప్రేక్ష‌కుడి నాడి.. ఏ సినిమా చేయాలో.. ఏ క‌థ‌ని ఎంచుకోవాలో అర్థం కాని ప‌రిస్థితి. ఓ ప‌క్క స్టార్ డైరెక్ట‌ర్‌లు ఇంటిముఖం ప‌డుతుంటే కొత్త ద‌ర్శ‌కులు అద్భుతాలు సృష్టించ‌డం బ‌న్నీని గంద‌ర‌గోళానికి గురిచేసింది. స్టార్ డైరెక్ట‌ర్‌తో వెళ్లాలా?...చిన్న ద‌ర్శ‌కుడిని ఎంచుకోవాలా? అనే విష‌యంలో గ‌త కొంత కాలంగా త‌ర్జ‌న‌భ‌ర్జ‌న ప‌డుతున్న బ‌న్నీ ఎట్ట‌కేల‌కు ఓ క్లారిటీకి వ‌చ్చేశాడు.

త‌న త‌దుప‌రి చిత్రాన్ని త్రివిక్ర‌మ్‌తో ముందు చేయాల‌నుకున్నా ఆ ఛాన్స్‌ని `గీత గోవిందం`తో మ్యాజిక్ చేసిన ప‌ర‌శురామ్‌కిచ్చేశాడు. గ‌త కొంత కాలంగా క‌థ ఎంపిక‌పై కూడా క‌న్‌ఫ్యూజ్‌లో వున్న అల్లు అర్జున్ కు ఇటీవ‌ల ప‌ర‌శురామ్ చెప్పిన ల‌వ్‌స్టోరీతో పిచ్చ క్లారిటీ వ‌చ్చేసిందట‌. అందుకే ప‌ర‌శురామ్ చెప్పిన ట్ర‌యాంగిల్ ల‌వ్‌స్టోరీకి ప‌చ్చ‌జెండా ఊపిన‌ట్లు తెలిసింది. స్క్రీన్‌ప్లే ప్ర‌ధానంగా సాగే ఈ రొమాంటిక్ ల‌వ్‌స్టోరీని గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై అల్లు అర‌వింద్ నిర్మించేందుకు అప్పుడే స‌న్నాహాలు కూడా మొద‌లుపెట్టేశారు.

గ‌త కొంత కాలంగా స్టార్ హీరోతో ప‌నిచేయాల‌ని ఎదురుచూస్తున్న ప‌ర‌శురామ్‌కిది గోల్డెన్ ఆఫ‌ర్ అన్న‌ట్టే. బ‌న్నీ ఇచ్చిన బంగారంలాంటి అవ‌కాశాన్ని ప‌ర‌శురామ్ ఎంత వ‌ర‌కు స‌ద్వినియోగం చేసుకుంటాడ‌న్న‌ది అత‌ని చేతుల్లోనే వుంది. అయితే  క‌థ లేకుండా కేవ‌లం భావోద్వేగాల ప్ర‌ధానంగా `గీత గోవిందం`ను ప‌ర‌శురామ్ న‌డిపించిన తీరు చూసిన వాళ్లంతా బ‌న్నీతో ప‌ర‌శురామ్ మ‌రో అద్భుతం చేయ‌డం గ్యారంటీ అంటున్నారు. బెస్ట్ ఆఫ్ ల‌క్ ప‌ర‌శురామ్‌. 

bunny greensignal to parasuram:

bunny team up with parasuram

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ