Advertisementt

ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఈ సినిమాదే హవా!

Tue 25th Dec 2018 12:53 PM
kgf,rtc x roads,hulchul,kgf team  ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఈ సినిమాదే హవా!
High Budget Film Hulchul at RTC X Roads ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఈ సినిమాదే హవా!
Advertisement
Ads by CJ

ఈ క్రిస్మస్ పండగ సెలవులకి బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేయడానికి  తెలుగులో నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో రెండు స్ట్రెయిట్ సినిమాలు అయితే.. రెండు డబ్బింగ్ చిత్రాలు. తెలుగు వారంతా హోప్స్ పెట్టుకుంది ‘పడి పడి లేచె మనసు’.. ‘అంతరిక్షం’ పైనే. ఈ రెండు సినిమాలు ఒకేరోజు రిలీజ్ అయ్యాయి. క్రేజీ కాంబినేషన్స్ తో తెరకెక్కిన ఈ రెండు చిత్రాలు విడుదల కి ముందు ఎంతో ఆసక్తి రేకెత్తించాయి. 

కానీ ఇవి రెండూ అంచనాల్ని అందుకోలేకపోయాయి. వరుణ్ తేజ్ ‘అంతరిక్షం’  కొద్దిగా పర్లేదు అనిపించుకున్న శర్వా ‘పడి పడి లేచె మనసు’ బాగా నిరాశ  పరిచింది. అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే అదే రోజు రిలీజ్ అయిన ‘మారి 2’.. ‘కేజీఎఫ్’ పరిస్థితి కొంచెం బాగానే ఉంది. ‘మారి 2’ బీలో యావరేజ్ గా నిలవగా  ‘కేజీఎఫ్’ కు డివైడ్ టాక్ వచ్చినప్పటికీ మాస్ ప్రేక్షకులకు ఈ సినిమా బాగా నచ్చుతుంది. ముఖ్యంగా ఇందులో హీరో ఎలివేషన్లు.. మాస్ అంశాలు ఆ వర్గం ప్రేక్షకులకు బాగా నచ్చుతున్నాయి.

ఈ ఆదివారం హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో రిలీజ్ అయిన సినిమాల్లో ఒక్క ‘కేజీఎఫ్’కు మాత్రమే హౌస్ ఫుల్స్ పడింది అంటే దీని క్రేజ్ ఎలా ఉందో  ఆలోచించవచ్చు. బి, సి సెంటర్స్ కి ఈ మూవీ విపరీతంగా నచ్చుతుంది. దీనితో పాటు అంతకు ముందు వారం రిలీజ్ అయిన  చిన్న సినిమా ‘హుషారు’కు హౌస్ ఫుల్ బోర్డు పడటం విశేషం. ఈ చిత్రానికి యూత్ బాగా కనెక్ట్ అవుతున్నారు.

High Budget Film Hulchul at RTC X Roads:

KGF Creates Sensation at RTC X Roads

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ