Advertisementt

తెలుగు దర్శకుడు ఆ హీరోయిన్‌తో ‘జామ్ జామ్’

Tue 25th Dec 2018 12:10 PM
telugu director,neelakanth,mollywood,zam zam,queen remake,kangana,manjima mohan  తెలుగు దర్శకుడు ఆ హీరోయిన్‌తో ‘జామ్ జామ్’
Telugu director’s ZAM ZAM in Mollywood తెలుగు దర్శకుడు ఆ హీరోయిన్‌తో ‘జామ్ జామ్’
Advertisement
Ads by CJ

మళయాలంలో తెలుగు దర్శకుడు నీలకంఠ ‘జామ్ జామ్’

బాలీవుడ్‌లో క్వీన్ మూవీతో తిరుగులేని స్టార్ డమ్ తెచ్చుకున్న భామ కంగనా రనౌత్. హీరోయిన్ ఓరియంటెడ్ స్టోరీగా వచ్చిన క్వీన్ విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్ గానూ అతిపెద్ద విజయం సాధించింది. అలాంటి చిత్రాన్ని దక్షిణాదిలోని అన్ని భాషల్లో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే...

మళయాలంలో ‘జామ్ జామ్’ పేరుతో తెరకెక్కుతోన్న ఈ మూవీలో మంజిమా మోహన్ కథానాయిక. కేవలం మలయాళ వెర్షన్‌కు మాత్రమే మన తెలుగు దర్శకుడు నీలకంఠ దర్శకత్వం వహించారు. తెలుగులో షో సినిమాతో జాతీయ అవార్డ్ అందుకున్న నీలకంఠ ఇప్పుడు మలయాళ చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టడం విశేషం. ఇక రీసెంట్‌గా ఈ రీమేక్‌కు సంబంధించిన నాలుగు భాషల టీజర్స్ విడుదలయ్యాయి.

మళయాల వెర్షన్‌కు అద్భుతమైన స్పందన వస్తోంది. రీమేక్ అయినా అత్యంత సహజంగా కేరళ నేచురాలిటీకి దగ్గరగా రూపొందుతోన్న ఈ సినిమా టీజర్‌కు అద్భుతమైన స్పందన రావడం విశేషం. త్వరలో ట్రయిలర్ మరియు సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు.

ఇక మీడియెంట్ ఫిల్మ్స్ పతాకంపై రూపొందుతోన్న ఈ సినిమాలో మంజిమామోహన్‌తో పాటు సన్నీవేన్, షిబానీ దండేకర్, బాయిజు, ముత్తుమని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సాంకేతికంగానూ అత్యున్నతంగా కనిపిస్తోన్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: మిచెల్లే టబురెక్సీ, సంగీతం: అమిత్ తివారీ, ఎడిటింగ్: ప్రదీప్‌శంకర్, రచన: విపిన్ రాధాకృష్ణ, సహ నిర్మాత: పరుల్ యాదవ్, నిర్మాత: మను కుమరన్, స్క్రీన్ ప్లే,దర్శకత్వం: నీలకంఠ.

Telugu director’s ZAM ZAM in Mollywood:

Telugu director Neelakantha goes to Mollywood with ZAM ZAM 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ