మన ప్రపంచానికి నాగరీకత పరిచయం అయ్యాక.. డబ్బు అనేది సృష్టించనంతవరకు అందరూ ఇచ్చిపుచ్చుకోవడం అనే పద్ధతిని అనుసరించేవారు. ఆ తర్వాత నాణేలు, కరెన్సీ అందుబాటులోకి రావడంతో.. పంచభూతాలతోపాటు డబ్బు ఆరవ భూతంగా మారిపోయింది. అయితే.. మన చిత్రసీమలో మాత్రం ఇప్పటికీ ఇచ్చుపుచ్చుకోవడం అనే పద్ధతినే ఫాలో అవుతూ వస్తున్నారు. పర్టీక్యులర్ గా హీరోయిన్లకు అవకాశం ఇవ్వడంలో ఈ పద్ధతి బాగా పాపులర్. కథానాయకులు మాత్రమే కాదు దర్శకనిర్మాతలు కూడా హీరోయిన్లు తమకు అందించే సహకారం బట్టే అవకాశాలు ఇస్తుంటారు. దీన్నే క్యాస్టింగ్ కౌచ్ అంటారనుకోండి.
ఇకపోతే.. నిన్నమొన్నటివరకూ ఈ ఇచ్చిపుచ్చుకోవడాల పద్ధతి కారణంగా బాగా లాభపడిన ఓ యువ కథానాయకి ఇప్పుడు అదే పద్ధతి కారణంగా ఇబ్బందులుపడుతోందట. ఓ యావరేజ్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ యువ కథానాయకికి కమర్షియల్ హిట్ దొరక్కపోయినా.. నటిగా గుర్తింపు వచ్చింది. అయితే ఆ గుర్తింపు సినిమా అవకాశాలు తెచ్చిపెట్టడానికి సరిపోదని తెలిసిరావడానికి అమ్మడికి ఏడాది పట్టిందనుకోండి. ఆ తర్వాత కాంప్రమైజ్ అయ్యి వరుస అవకాశాలు అందుకొంది. మరి ఉన్నట్లుండి ఈ పద్ధతి అంటే బోర్ కొట్టిందో లేక వద్దనుకోందో తెలియదు కానీ.. ఉన్నట్లుండి ఆ స్టార్ హీరోల బ్యాచ్ కి సహకరించడం మానేసింది. తమ అవసరానికి పనికిరాని అమ్మాయి.. సినిమాల్లో ఎందుకు అనుకొన్నారో ఏమో తెలియదు కానీ.. వాళ్ళు కూడా సహాయ నిరాకరణ మొదలెట్టారు. ప్రస్తుతం అమ్మడి చేతిలో ఒకే ఒక్క సినిమా ఉంది. ఆ సినిమా హిట్ అయినా కూడా మరో సినిమా వస్తుందన్న నమ్మకం లేదు. దీనికి తోడు ఈ మధ్యే రిలీజయి ఫ్లాప్ అయిన ఓ హై బడ్జెట్ కుర్ర హీరో చిత్రంలో సెకండ్ హీరోయిన్ పాత్రకు సైతం ఒప్పుకునే స్థాయికి మెట్టు దిగినా లాభం లేకుండా పోయింది. కారణం ఏంటో ఆమెకు తెలియకుండా లేదు.
మరి అమ్మడు ఆ అసలు విషయాన్ని దృష్టిలో పెట్టుకొని తన సహాయ నిరాకరణను మానేసి మళ్ళీ వాళ్ళకి ఎవైలబుల్ గా మారుతుందా లేక ఇలాగే కంటిన్యూ అయ్యి సినిమాలకు దూరమవుతుందా అనేది చూడాలి. గుడ్డిగా హిట్లు కొట్టడం మాత్రమే కాదు... హీరోలకు ఆ అవసరాలు తీర్చడంలో కూడా కాసేపు కళ్ళు మూసుకొని గుడ్డిగా నటిస్తే ఆఫర్లు క్యూ కడతాయి అన్న సంగతి ఆమెకు తెలియంది కాదనుకోండి.