అల్లు అర్జున్ కొత్తగా ఓ బిజినెస్ స్టార్ చేశాడు. మహేష్ బాబు లా మల్టీ ప్లెక్స్ బిజినెస్ లోకి దిగాడు. సునీల్ నారంగ్ తో కలిసి త్వరలోనే బన్నీ ఓ మల్టీప్లెక్స్ స్టార్ట్ చేయబోతున్నాడు. ఆల్రెడీ మాల్ ప్లస్ మల్టీప్లెక్స్ నిర్మాణం కూడా జరిగిపోయింది. త్వరలోనే ఓపెనింగ్ చేయనున్నారు. మహేష్ గచ్చిబౌలిలో సినిమాస్ ఓపెన్ చేయగా.. బన్నీ హైదరాబాద్ నడిబొడ్డులోని అమీర్ పేటలో మల్టీప్లెక్స్‌ను ఓపెన్ చేయనున్నాడు.
అమీర్‌పేటలో ఇదివరకు సత్యం థియేటర్ ఉండేది. ఇప్పుడు ఆ ప్లేస్ లో మాల్ ప్లస్ మల్టీప్లెక్స్ రాబోతుంది. ఇందులో బన్నీ ఐమాక్స్ స్క్రీన్ అంత పెద్దగా ఉండే పెద్ద ఐమాక్స్ తెరను ఏర్పాటు చేయనున్నాడట. మొన్నటి వరకు బిగ్ స్క్రీన్ అనగానే హైదరాబాద్ లోని ఐమాక్స్ స్క్రీన్ గుర్తుకువచ్చేది. తెలుగు రాష్ట్రాల్లోనే ఇప్పటి వరకు ఇంత బిగ్ స్క్రీన్ లేదు.
అయితే ఇప్పుడు బన్నీ దానికి మించి పెద్ద స్క్రీన్ ను ఏర్పాటు చేయనున్నాడట. అమీర్ పేట్ లో యూత్ ఎక్కువగా ఉంటారు కాబట్టి వారిని టార్గెట్ చేస్తూ అక్కడ మల్టీప్లెక్స్ ను ఏర్పాటు చేస్తున్నట్టు సమాచారం. సో ఇకనుంచి బిగ్ స్క్రీన్ లో సినిమా చూడాలంటే ఐమాక్స్ వరకు వెళ్లనవసరం లేదు. అమీర్‌పేటలో త్వరలోనే ఆ కల తీరనుంది. బన్నీ అమీర్‌పేటలో యూత్‌ని టార్గెట్ చేస్తే.. మహేష్ గచ్చిబౌలీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులని టార్గెట్ చేశాడు.