స్టార్ హీరోలకు విడుదల తేదీల విషయంలో క్లాష్ రావడం విని ఉంటాం లేదా నెంబర్ ఒన్ ఎవరు అనే విషయంలో క్లాష్ రావడం విని ఉంటాం. కానీ.. ఈ ఏడాది ఒక విచిత్రమైన సమంత, రష్మికలకి క్లాష్ వచ్చింది. అయితే.. ఆ క్లాష్ ఏదో సినిమాకి సైన్ చేయడంలోనో లేక మరొకటో కాదు. హీరోయిన్ ఆఫ్ ది ఇయర్ ఎవరా అని ప్రకటించే విషయంలో. నటిగా సమంత రంగస్థలం, మహానటి లాంటి చిత్రాలతో ఒక మెట్టు ఎక్కితే.. హీరోయిన్ గా ఈ ఏడాది తెలుగు తెరకు పరిచయమైన రష్మిక మందన్న మాత్రం ఏకంగా రెండు "ఛలో, గీత గోవిందం" లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ మరియు దేవదాస్ లాంటి మోడరేట్ హిట్ తో మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా బరిలో నిలిచింది.
దాంతో ఈ ఏడాది బెస్ట్ హీరోయిన్ గా సమంతను మెచ్చుకోవాలా లేక వరుస హిట్స్ సాధించిన రష్మికను అభినందించాలా ని మీడియా మిత్రులందరూ తలబాదుకొంటున్నారు. కానీ.. కొండరేమో సింపుల్ గా బెస్ట్ డెబ్యూ రష్మికకు ఇచ్చేసి.. బెస్ట్ యాక్ట్రెస్ కింద సమంతను నామినేట్ చేస్తే సరిపోతుందని చెబుతున్నారు.
అయితే.. సమంత లాంటి స్టార్ హీరోయిన్ కు రష్మిక లాంటి కొత్తమ్మాయి ఈస్థాయిలో పోటీ ఇవ్వడం అనేది మాత్రం చర్చనీయాంశంగా మారింది. సమంత ఒక్కదానికే కాదు రష్మిక చాలా మంది సీనియర్ హీరోయిన్ కి గట్టి పోటీనిస్తోంది. హీరోలందరూ ఆమెను లక్కీ అనుకొంటుండడమే అందుకు కారణం. మరి రష్మిక లక్ ఇంకెన్నాల్లో కలిసొస్తుందో చూడాలి.