Advertisementt

సాయిపల్లవికి యావరేజ్ మార్కులే!

Sun 23rd Dec 2018 07:55 AM
sai pallavi,padi padi leche manasu,maari 2,sharwanand,dhanush,disappoint  సాయిపల్లవికి యావరేజ్ మార్కులే!
Again Sai Pallavi Disappoints With 2 Films సాయిపల్లవికి యావరేజ్ మార్కులే!
Advertisement
Ads by CJ

సాయి పల్లవి తెలుగు, తమిళ సినిమాలతో బాగా బిజీ అయ్యింది. స్టార్ హీరోల పక్కన ఛాన్స్ లు రాకపోతేనేమి.. మీడియం రేంజ్ హీరోలతో జోడి కడుతూ దూసుకుపోతుంది. తెలుగులో మీడియం రేంజ్ హీరోలతోనే సరిపెట్టుకుంటున్న సాయి పల్లవి తమిళనాట మాత్రం ధనుష్, సూర్య వంటి స్టార్ హీరోల సరసన నటిస్తుంది. ప్రస్తుతం సాయి పల్లవికి డిసెంబర్ 21 బిగ్ డే. ఎందుకంటే సాయి పల్లవి నటించిన రెండు సినిమాలు డిసెంబర్ 21 నే విడుదలయ్యాయి. తెలుగులో శర్వానంద్ తో కలిసి నటించిన పడి పడి లేచె మనసు, తమిళంలో ధనుష్ సరసన నటించిన మారి 2 రెండు చిత్రాలు ఒకేరోజు విడుదలవడంతో... సాయి పల్లవికి డిసెంబర్ 21 బిగ్ డే అయ్యింది.

అయితే సాయి పల్లవి రెండు సినిమాలలోనూ అదరగొట్టే నటనతో ఆకట్టుకుంది. పడి పడి లేచె మనసులో శర్వానంద్ కి జోడిగా డాక్టర్ పిల్లగా, శర్వాతో రొమాంటిక్ సన్నివేశాల్లోను, ఎమోషన్స్ గాను సాయి పల్లవి నటన సూపర్బ్. సాయి పల్లవి నటనే పడి పడి లేచె మనసుకు హైలెట్ అంటే... ఇక సాయి పల్లవి ఎలా నటించిందో అర్ధమవుతుంది. డాన్స్ ల లోను సాయి పల్లవి అదరగొట్టేసింది. అయితే శర్వా, సాయి పల్లవుల నటన పడి పడి లేచె మనసుని సూపర్ హిట్ చేయలేకపోయాయి. ఆ సినిమాలో ఉన్న కొన్ని మైనస్ ల వల్ల సినిమాకి యావరేజ్ టాక్ పడింది. క్రిటిక్స్ కూడా పడి పడి కి యావరేజ్ మార్కులే వేశారు.

ఇక సాయి పల్లవి మరో సినిమా మారి 2 తెలుగులో కూడా విడుదలైంది. ఈ సినిమాలో ధనుష్ కి జోడిగా మాస్ పిల్లగా అలరించిన సాయి పల్లవి నటన పరంగా అదరగొట్టింది. ధనుష్ సిక్స్ ప్యాక్, మాస్ నటనకు తోడు, ఆటో డ్రైవర్ పాత్రలో.. ఎవరికీ భయపడని చలాకీ అమ్మాయిల సాయి పల్లవి నటన సూపర్ అనేలా ఉంది. ఆనంది పాత్రలో సాయి పల్లవి తన పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా మాస్ క్యారెక్టర్ లో ఉన్న ధనుష్ ని ఆమె ఆటపట్టించిన తీరు ఎక్కువగా ఎట్రాక్ట్ చేస్తోంది. సినిమాలో వీరి కాంబినేషన్ కి మంచి మార్కులు పడుతున్నాయి. అయితే ఈ సినిమా కూడా యావరేజ్ తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మరి టోటల్ గా సాయి పల్లవి తెలుగు పడి పడి లేచె మనసుతోను, తమిళ మారి 2 తోనూ యావరేజే అందుకుంది కానీ.. హిట్స్ అందుకోలేకపోయింది.

Again Sai Pallavi Disappoints With 2 Films:

Sai Pallavi Not Reached The Hit Mark

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ