నిన్న శుక్రవారం రాత్రి హైదరాబాద్ లో జరిగిన ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు ఆడియోకి ఎన్టీఆర్ సన్నిహిత నటులతో పాటుగా... ఎన్టీఆర్ బయోపిక్ లో భాగమైన నటులు.... నందమూరి ఫ్యామిలీ మెంబర్స్ హాజరయ్యారు. ఈ వేడుకలో ప్రధాన ఆకర్షణ బాలకృష్ణ ఎన్టీఆర్ గెటప్ కాగా.... జూనియర్ ఎన్టీఆర్ మరో మెయిన్ ఎట్రాక్షన్. జూనియర్ ఎన్టీఆర్, ఎన్టీఆర్ బయోపిక్ లో భాగం కానప్పటికీ... ఈ వేడుకకి బాబాయ్ బాలయ్య పిలవగానే పరిగెట్టుకుని వచ్చేశాడు. ఇక ఎన్టీఆర్ కుటుంబంలో తాను ఒక సభ్యుడినైనందుకు గర్వంగా ఉందని చెప్పి నందమూరి అభిమానుల మనసు గెలిచాడు. ఇక బాలకృష్ణ ఆ వేడుక జరుగుతున్నంత సేపు వచ్చిన అతిధులను ఆహ్వానిస్తూ.. స్టేజ్ మీద తండ్రి ఎన్టీఆర్ గురించి ఎన్టీఆర్ బయోపిక్ ముచ్చట్ల గురించి మాట్లాడుతున్న వారికి దగ్గరలోనే నిలబడి మరీ వారిని ప్రోత్సహించాడు. మామూలుగానే బాలయ్య ఎనర్జీ కుర్ర హీరోలకు కూడా ఉండదు.
ఇక నిన్న జరిగిన వేడుకలో బాలకృష్ణ, ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో వేడుక మీద గంటల తరబడి నించోవడమే కాదు.. చాలా హుషారుగా కనిపించాడు. అథిదులు మాట్లాడుతున్నప్పుడు... ఇంకా తన తండ్రి గురించి వారేమన్నా మరిచిపోయిన ముచ్చట్లను గుర్తు చేస్తూ స్టేజ్ మీద అలా గంటలు తరబడి నిలబడడం మాటలు కాదు. కానీ చివరి వరకు ఆయన చిన్న అలసటకు కూడా లోనైనట్లుగా కనబడలేదు. తండ్రి బయోపిక్ లో తాను నటించడం తన అదృష్టమని చెప్పిన బాలయ్య అన్న కొడుకులు కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ లతో ఎంతో ఆత్మీయంగా కనిపించాడు. అలాగే తన అక్కలతోను, క్రిష్, మోహన్ బాబు, జమున అందరితో ఎంతో యాక్టీవ్ గా మాట్లాడుతూ చాలా ఎనర్జీతో బాలయ్య, ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో వేడుకని పూర్తి చేశాడు. మరి అన్ని గంటలు స్టేజ్ మీద స్పెండ్ చేసిన బాలయ్య తాను స్పీచ్ ఇచ్చేటప్పుడు కూడా అంతే హుషారుగా మాట్లాడాడు. అసలు బాలయ్య ఎనర్జీ లెవల్స్ చూసి అబ్బా బాలయ్య నువ్వు సూపర్ అంటున్నారు నందమూరి అభిమానులు.