Advertisementt

‘యన్.టి.ఆర్’ ట్రైలర్: గర్జించిన సింహం

Sat 22nd Dec 2018 08:51 AM
balakrishna,ntr biopic,trailer,launch,kathanayakudu,mahanayakudu  ‘యన్.టి.ఆర్’ ట్రైలర్: గర్జించిన సింహం
NTR Theatrical Trailer Review ‘యన్.టి.ఆర్’ ట్రైలర్: గర్జించిన సింహం
Advertisement
Ads by CJ

జూన్ నుండి సెట్స్ మీదకెళ్ళిన ఎన్టీఆర్ బయోపిక్ మీద తెలుగు ప్రేక్షకులు అంచనాలు మాములుగా లేవు. దర్శకుడు క్రిష్ మహాయజ్ఞంలా ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు, మహానాయకుడు పార్ట్ 1 పార్ట్ 2 లను పూర్తి చేస్తున్నాడు. నందమూరి బాలకృష్ణ స్వయంగా మరొక నిర్మాతతో కలిసి నిర్మిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ సంక్రాంతికి విడుదలవడంతో... ప్రస్తుతం ప్రమోషన్స్ జోరందుకున్నాయి. ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు ఆడియో లాంచ్ వేడుక ఈ రోజు శుక్రవారం రాత్రి హైదరాబాద్ జెఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో ఘనంగా ప్రారంభమైంది. అయితే ఆ వేడుకలో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో పాటుగా ఎన్టీఆర్ కి సన్నిహితులు కూడా పాల్గొన్నారు. బాలకృష్ణ ఎన్టీఆర్ గెటప్ లోనే ఈ వేడుకలో పాల్గొనగా... ఎన్టీఆర్ బయోపిక్ ట్రైలర్ లాంచ్ కార్యక్రమం కూడా జరిగింది.

ఎన్టీఆర్ బయోపిక్ ట్రైలర్ లో బాలకృష్ణ ఎన్టీఆర్ గా ఎంత చక్కగా అతికాడో అనేది లుక్ లోనే స్పష్టమైంది. ఎన్టీఆర్ బయోపిక్ లుక్స్ తో ఇరగదీసిన క్రిష్ ఇప్పుడు ట్రైలర్ ని కూడా చాలా చక్కగా ప్రేక్షకులు మెచ్చేలా కట్ చేశాడు. ఎన్టీఆర్ ఉద్యోగం చేస్తూ.. దానిని వదిలేసి సినిమా రంగ ప్రవేశం చేసినప్పటినుండి.. ఆయన రాజకీయాల్లోకి వచ్చి .. ఎదుర్కొన్న ఒడిడుకులు.. తన పర్సనల్ లైఫ్ తో పాటుగా సినీ జీవితం, రాజకీయ జీవితాలను క్రిష్ హ్యాండిల్ చేసిన విధానము అద్భుతమని చెప్పాలి. సినిమాలోకి వచ్చిన కొత్తల్లో ప్రకాష్ రావు వాయిస్ ఓవర్ తో రామారావేంటి? కృష్ణుడేంటి అంటే ఆ పాత్ర‌కు ఆయ‌న చ‌క్క‌గా స‌రిపోతారు… ఆయ‌న‌క‌ళ్ల‌లో ఓ కొంటెద‌నం ఉంటుంది.. అంటూ కెవి రెడ్డి (క్రిష్) వివ‌రించిన డైలాగ్ తో ఎన్టీఆర్ బయోపిక్ ట్రైలర్ మొదలైంది. ఉద్యోగం వదిలేసి సినిమాల్లోకి వెళతానని చెప్పడం... సినిమాల్లోకి వెళ్ళాక రాజకీయాల్లోకి వచ్చేముంది నీ కోసం జనాలు టికెట్స్ కొనుక్కుని థియేటర్స్ కి వస్తున్నారు.. నువ్వే జనాల్లోకి వెళితే నీ సినిమాలే ఎవడు చూడరని చెప్పడం.. జ‌నం కోస‌మే సినిమా అనుకున్నా.. ఆ జనానికే అడ్డ‌మైతే, సినిమా కూడా వ‌ద్ద‌నుకుంటాను అంటూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ ఉంది చూశారూ విజిల్స్ వెయ్యాలనిపించే ఆత్రుత వచ్చేస్తుంది.

ఇన్నాళ్లు మన కోసం బ్రతికాను.. ఇక జనం కోసం బ్రతుకుతాను అంటూ చెప్పే డైలాగు అన్ని అక్కట్టుకున్నాయి. ఇక ఎన్టీఆర్ గెటప్స్ లో బాలయ్య బాబు ఉన్నాడు చూశారూ.. నందమూరి అభిమానులే కాదు.. సాధారణ ప్రేక్షకుడు కూడా పడిపోవాల్సిందే. ఇక బసవతారకంగా విద్యాబాలన్ అదిరిపోయింది. ఎన్టీఆర్ ని బావ అంటూ బసవతారకం పిలిచే పిలుపు అబ్బా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. నిన్నంద‌రూ ఇక్క‌డ దేవుడు అంటున్నారు.. అక్క‌డ నువ్వు కూడా అంద‌రిలాంటి మ‌నిషివైపోతావా బావా… అనగా దానికి ఎన్టీఆర్ న‌న్ను దేవుడ్ని చేసిన మ‌నిషి కోసం.. నేను మళ్ళీ మ‌నిషిలా మార‌డానికి సిద్ధంగా ఉన్నాను అని చెబుతాడు. ఇక ఈ సినిమాకి కీరవాణి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ప్రాణం అన్నట్టుగా అనిపిస్తుంది.

NTR Theatrical Trailer Review:

NTR Trailer Review  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ