అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని.. ఎన్నో అంచనాల నడుమ వరుణ్ తేజ్..లావణ్య త్రిపాఠి..అదితి రావు హైదరీ నటించిన ‘అంతరిక్షం’ సినిమా విడుదలైంది. ‘ఘాజీ’ తరువాత సంకల్ప్ రెడ్డి తీసిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇండస్ట్రీ కూడా ఈసినిమా కోసం ఎదురు చూస్తుంది. క్రిష్ నిర్మించిన ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగా జరిగింది.
అంత బాగానే ఉంది కానీ ఈచిత్రం యొక్క టాక్ టీం ను ఇబ్బంది పెడుతుంది. ‘ఘాజీ’ లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ తో అందరిని ఇంప్రెస్ చేసిన సంకల్ప్ ఈ సినిమాను తీర్చిదిద్దటంలో విఫలమయ్యాడని తెలుస్తోంది. ‘ఘాజీ’లో ఇండియా - పాకిస్తాన్ మధ్య అండర్ వాటర్ యుద్ధంను ఎంతో ఉత్కంఠగా చూపించాడు. కానీ ‘అంతరిక్షం’ విషయంలో ఫస్ట్ హాఫ్‌తో వీక్ అనిపించినా.. సెకండ్ హాఫ్‌తో మాత్రం బావుంది.
ఫస్టాఫ్ మొత్తం పాత్రలు ఇంట్రడ్యూస్ చేయడం..ఎటువంటి డీవియేషన్స్ లేకుండా స్ట్రెయిట్‌గా స్టోరీ లోకి వెళ్ళిపోతే.. సెకండాఫ్‌కి వచ్చేసరికి వరుణ్ స్పేస్ సెంటర్‌లో ఉండటంతో మాటలు అసలు ఉండవ్ అని అంత మ్యూజిక్ తోనే మ్యానేజ్ చేసాడని తెలుస్తుంది. దీంతో ఏ సెంటర్స్‌లో ఈసినిమా పాస్ అయిపోతుంది కానీ మాస్ పీపుల్స్ ఉన్న బీ,సీ సెంటర్స్ లో ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అని యూనిట్ టెన్షన్ పడుతున్నట్టు సమాచారం. మాస్ ప్రేక్షకులు కూడా సెకండాఫ్‌కి కనెక్ట్ అయితే సినిమా హిట్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. చూద్దాం ఇంకాసేపట్లో రివ్యూలో ఏ విధంగా వస్తాయో..