Advertisementt

లారెన్స్ దెయ్యం.. ‘పెట్టా’లో..!

Fri 21st Dec 2018 06:12 PM
rajinikanth,lawrence,petta,kanchana 3,motion poster,interval  లారెన్స్ దెయ్యం.. ‘పెట్టా’లో..!
Lawrence Devil in Petta లారెన్స్ దెయ్యం.. ‘పెట్టా’లో..!
Advertisement
Ads by CJ

కొరియోగ్రాఫర్‌గా, నటునిగా, దర్శకునిగా ఉంటూ హీరో స్థాయికి ఎదిగి సక్సెస్‌ అయిన అరుదైన వ్యక్తి రాఘవలారెన్స్‌. ఈయన ‘మాస్‌, డాన్‌’ చిత్రాలకు దర్శకత్వం వహించి అందులో కీలకమైన పాత్రలను కూడా పోషించాడు. ఇక ‘ఆంటీ’ చిత్రం నుంచి ‘స్టైల్‌’ వరకు తన సత్తా చాటాడు. అయితే నాగార్జున వంటి స్టార్స్‌తో చేసినా కూడా ఆయనకంటూ దర్శకునిగా, ఓ హీరోగా పేరు తెచ్చిన చిత్రాలు మాత్రం హర్రర్‌ కామెడీ జోనరేనని చెప్పాలి. ఆ రూట్‌లో ఆయన తీసిన ‘ముని, కాంచన, గంగ’ వంటి చిత్రాలు తమిళంలో ఎంతగా కాసుల వర్షం కురిపించాయో తెలుగులో విడుదల చేసిన నిర్మాతలకు కూడా అదే స్థాయి లాభాలను అందించాయి. నిజానికి తెలుగులో మారుతి దర్శకత్వంలో వచ్చిన ‘ప్రేమకథా చిత్రమ్‌’ ఇక్కడ హర్రర్‌ కామెడీ చిత్రాల ట్రెండ్‌కి తెరలేపిందని భావిస్తారు గానీ నిజానికి ఈ ట్రెండ్‌కి ఇటీవల ఆధ్యునిగా మాత్రం లారెన్స్‌నే చెప్పాలి. 

ఇక ఈయన హర్రర్‌ కామెడీతో పాటు పి.వాసు దర్శకత్వంలో ‘శివలింగ’, తెలుగులో వచ్చిన ‘పటాస్‌’ చిత్రాల రీమేక్స్‌ లో నటించినా కూడా ఈయనకు ఆ స్థాయి హిట్స్‌ పడలేదు. దాంతో ఆయన మరోసారి ‘ముని’ సీక్వెల్‌నే నమ్ముకున్నాడు. ఈ సారి ఆయన ‘కాంచన 3’ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ మూవీని సన్‌పిక్చర్స్‌ వంటి ప్రతిష్టాత్మక సంస్థతో పాటు లారెన్స్‌ కూడా నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నాడు. ఈమూవీలో ఓవియా, వేదికలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘కాంచన’లో శరత్‌కుమార్‌ కీలకపాత్రను పోషించినట్లుగా ఈ ‘కాంచన 3’లో కూడా ఓ ఆసక్తికర ట్విస్ట్‌ ఉంటుందని సమాచారం. ఈ మూవీకి తాజాగా ఎంతో ముందుగానే రిలీజ్‌ డేట్‌ని కూడా ఫిక్స్‌ చేయడం విశేషం. వచ్చే వేసవి కానుకగా ఏప్రిల్‌ 18వ తేదీన ఈ మూవీని రిలీజ్‌ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తెలుగుతో పాటు తమిళంలో కూడా మంచి పేరున్న, జోరుమీదున్న సంగీత దర్శకుడు, ఆర్‌ఆర్‌లో స్పెషలిస్ట్‌ అయిన తమన్‌ని ఈ చిత్రం కోసం లారెన్స్‌ ఏరికోరి ఎంచుకున్నాడు. 

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటించిన ‘పెట్టా’ చిత్రం ఇంటర్వెల్‌లో ఈ మూవీ మోషన్‌ పోస్టర్‌ని రిలీజ్‌ చేయడానికి సన్నాహాలు కూడా మొదలయ్యాయి. మరి గురువు రజనీ, తన శిష్యుడైన లారెన్స్‌కి ఎలాంటి ఫ్రీ ప్రమోషన్‌ని అందిస్తాడో వేచిచూడాల్సివుంది. ఎందుకంటే ఈ రెండు చిత్రాలను సన్‌ పిక్చర్స్‌ వారే నిర్మిస్తుండటం విశేషం. ‘ముని, కాంచన, గంగ’లాగా ఈ చిత్రం కూడా హిట్‌ అయి థియేటర్లలోనే కాదు.. ఎప్పుడు విడుదలైనా కూడా టివి చానెల్స్‌ రేటింగ్స్‌ని కూడా పెంచుతుందేమో వేచిచూడాలి. కాగా ఈ మూవీని కూడా తెలుగులో విడుదల చేసేందుకు పెద్ద పెద్ద నిర్మాతలు పోటీపడుతున్నారని సమాచారం. 

Lawrence Devil in Petta:

 Kanchana 3 Motion Poster in Petta Interval

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ