తమిళనాట నిర్మాతల మండలిలో చెలరేగిన విభేదాలు చివరికి విశాల్ అరెస్ట్ వరకు వెళ్ళింది వ్యవహారం. రేపు శుక్రవారం ఒకేసారి తొమ్మిది సినిమాలు విడుదలపై విశాల్ వ్యతిరేక వర్గం ఆందోళన చేస్తుంది. అలాగే నిన్న బుధవారం విశాల్ వ్యతిరేఖ నిర్మాతలు మొత్తం కలిసి నిర్మాతల మండలి కార్యాలయానికి తాళం వెయ్యడమే కాదు... ఆ తాళాలను దగ్గరలోని పోలీస్ స్టేషన్ లో అప్పజెప్పారు. ఇక విశాల్ దూకుడు స్వభావానికి చాలామంది నిర్మాతలు నష్టపోతున్నామని.. ఏ సినిమా విడుదలైన నిర్మాతలమండలిలో చెప్పి చేసుకోవాలనే నిబంధనలను విశాల్ వ్యతిరేఖ వర్గం ఒప్పుకోవడం లేదు. ఇంకా నిర్మాతల మండలిలో చాలా డబ్బు అవకతవకలు జరిగాయని నిర్మాతల మండలి ఆరోపిస్తుంది.
విశాల్ నిర్మాతల మండలి అధ్యక్ష పదవికి రాజీనామా చెయ్యాలని విశాల్ వ్యతిరేఖ వర్గం ఆందోళన చేస్తుంది. అయితే ఈ రోజు గురువారం ఉదయం విశాల్ నిర్మాతల మండలి కార్యాలయానికి వేసిన తాళాలు పగలగొట్టి అక్కడ పెండింగ్ లో ఉన్న పనులను చేసేందుకు ప్రయత్నించగా... పోలీసులు అడ్డుకోవడానికి ప్రయత్నించడం... విశాల్ పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో.. పరిస్థితి చేజారిపోతుండడం గ్రహించిన పోలీసులు విశాల్ ని అరెస్ట్ చేసి... అక్కడే స్థానికంగా ఉన్న ఒక కల్యాణ మండపంలో విశాల్ ని నిర్బంధించారు. అయితే అరెస్ట్ కి ముందు విశాల్ పోలీసులతో వాదానికి దిగడం, పోలీసుల మాట వినకపోవడంతో విశాల్ ని అరెస్ట్ చేసి కల్యాణ మండపంలోకి తరలించారు. మరి ఈ తమిళ నిర్మాతల మండలిలో వర్గ పోరు ఏ వివాదానికి దారితీస్తుందో అంటున్నారు. ఇక విశాల్ అరెస్ట్ తో నిర్మాతల మండలి కార్యాలయం దగ్గర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.