నిన్న సోషల్ మీడియా, వెబ్ మీడియాలో ఒక్కసారిగా ఎన్టీఆర్ ఫ్రెండ్ ఎన్టీఆర్ కి ఎన్నికల ప్రచారానికి వెళ్లోద్దని చెప్పబట్టే ఎన్టీఆర్ కూకట్‌పల్లి లో తన అక్క సుహాసిని కోసం టిడిపి, ప్రజకూటమి తరుపున ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదని న్యూస్ మాములుగా చక్కర్లు కొట్టలేదు. అయితే ఆ ఎన్టీఆర్ స్నేహితుడు ఎవరా అనుకునేలోపే... కేటీఆర్, ఎన్టీఆర్ ఫ్రెండ్ అంటూ న్యూస్ వచ్చేసింది. కేటీఆర్, ఎన్టీఆర్ మంచి స్నేహితులని.. కూకట్ పల్లిలో నందమూరి సుహాసినిని ఎన్నికల బరిలో నిలపడానికి చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారని.. తెలియడం.. సుహాసిని కూకట్ పల్లిలో నామినేషన్ వేయడంతో.. నందమూరి ఫ్యామిలీ మొత్తం సుహాసిని వెనకాల నిలబడతారనుకున్నారు. బాలకృష్ణ, చంద్రబాబు.. సుహాసిని కోసం ప్రచారం చేశారు. అయితే కూకట్ పల్లి బరిలో టీఆర్ఎస్ అభ్యర్థి చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడని.. అందుకే సుహాసినిని నిలిబెట్టారు గనక అక్కడికి నువ్వు ప్రచారానికి వెళ్లొద్దని కేటీఆర్ స్నేహితుడు ఎన్టీఆర్ కి చెప్పాడట. నువ్వు వెళితే నీ ఇమేజ్ పోతుంది... అందుకే వెళ్లకుండా సైలెంట్ గా ఉండమనే సరికి ఎన్టీఆర్ సైలెంట్ అయ్యి.. కనీసం మీడియాలో కూడా అక్క తరపున ప్రచారం చేయలేదట. మరి ఈ న్యూస్ చదివిన వారు అంతా ఆశ్చర్యం వ్యక్తం చేసారు. రామ్ చరణ్ - కేటీఆర్ లు బహిరంగంగా ఫ్రెండ్స్ అనే విషయం తెలుసు కానీ.. ఎన్టీఆర్, కేటీఆర్‌లు ఎప్పుడు ఫ్రెండ్స్ అయ్యరబ్బా అని అనుకున్నారు అంతా.
అయితే ఎన్టీఆర్, కేటీఆర్ లు ఫ్రెండ్స్ అనే ప్రూఫ్ ఇప్పుడు బయటికొచ్చింది. కేటీఆర్, ఎన్టీఆర్ ఇతర స్నేహితులతో కలిసి దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అయ్యింది. మరి నిజంగానే కేటీఆర్‌తో సన్నిహిత సంబంధాలు మెయింటింగ్ చేస్తూ నందమూరి సుహాసిని కోసం ప్రచారానికి ఎన్టీఆర్ హ్యాండ్ ఇచ్చాడా అనే అనుమానం ఇప్పుడు బలపడింది. అందుకే చంద్రబాబు ట్రాప్‌లో చిక్కుకోకుండా పూర్తిగా సినిమాల మీదే దృష్టి పెట్టాలనుకున్నాడా ఎన్టీఆర్? ఈ లెక్కన ఎన్టీఆర్ 2019 ఎన్నికల్లో టిడిపి తరుపున ప్రచారానికి రానట్లే? అంటూ సోషల్ మీడియాలో అప్పుడే ప్రచారం స్టార్ట్ ఆయ్యింది.
మరి కేటీఆర్ చెప్పినందువల్లే ఎన్టీఆర్.. సుహాసిని కోసం ఎన్నికల ప్రచారానికి డుమ్మా కొట్టాడో లేదో తెలియదు కానీ.. చంద్రబాబు వేసిన ప్లాన్ లో ఎన్టీఆర్ అయితే ఇరుక్కోలేదనేది స్పష్టంగా తెలుస్తుంది. మరి నటుడిగా అందరితో సన్నిహిత సంబంధాలు మెయింటింగ్ చేస్తున్నాడనేది ఈ ఫోటో ద్వారా స్పష్టమవుతుంది. అయితే పైన కనబడుతున్న ఫోటో ఎన్టీఆర్, కేటీఆర్ లు కలిసి ఒక ప్రవేట్ పార్టీలో రీసెంట్ గా పాల్గొన్న ఫోటో అనేది మాత్రం అర్ధమవుతుంది. మరి టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తో ఎన్టీఆర్ సన్నిహిత సంబంధం అంటూ ఇంకెన్ని న్యూస్ లు మీడియాలో ప్రత్యక్షమవుతాయి చూడాలి.