మన స్టార్ హీరోలు ఒకసారి యాక్ట్ చేసిన హీరోయిన్స్ ను రిపీట్ చేయడానికే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తుంటారు. అలాటిది చేసే సినిమాల విషయంలో ఇంకెంతలా ఆలోచించాలి చెప్పండి. అలాంటిది మహేష్ బాబు కొత్త సినిమా "మహర్షి" సెట్ లో ఉన్నవాళ్లందరికీ "శ్రీమంతుడు" చిత్రాన్ని గుర్తుకు చేస్తుందట. మూడు ప్రముఖ నిర్మాణ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వంశీ పైడిపల్లి వ్యయప్రయాసలతోపాటు భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం టాకీ పార్ట్ ఇప్పుడిప్పుడే ఒక కొలిక్కి వస్తోంది. ఇటీవల ఆర్.ఎఫ్.సిలో చేసిన షూటింగ్ విజువల్స్ చూసిన తర్వాత సినిమా యూనిట్ కు మాత్రమే కాక షూటింగ్ లో పాల్గొన్నవారికి కూడా ఇదేంటి శ్రీమంతుడు పార్ట్ 2లా ఉంది అనిపించిందట.
అందుకు ముఖ్య కారణం ఈ చిత్రంలో మహేష్ బాబు తండ్రి పాత్రను జగపతిబాబు పోషిస్తుండడం, అలాగే.. ఈ సినిమాలో జగపతిబాబు అండ్ ఫ్యామిలీ ఫుల్ రిచ్ అవ్వడం. జగ్గూ భాయ్ ఎంట్రీ ఏకంగా హెలికాఫ్టర్స్ తో ప్లాన్ చేశాడట వంశీ. ఈ హడావుడి చూస్తున్నవాళ్ళందరూ శ్రీమంతుడు సినిమాకి మరీ ఇంత దగ్గర పోలికలు ఉంటే.. కంపేరిజన్స్ వచ్చేస్తాయని భయపడుతున్నారు.
మరి వంశీ ఈ కంపేరిజన్స్ నుంచి ఎలా తప్పించుకొంటాడో తెలియదు కానీ.. ఏప్రిల్ లో ఉగాది కానుకగా విడుదలవ్వాల్సిన ఈ చిత్రం షూటింగ్ ఇంకా 30 శాతం పెండింగ్ ఉండగా.. పాటల చిత్రీకరణ కూడా పూర్తవ్వాల్సి ఉంది.