ఈ శుక్రవారం తెలుగులో 4 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వరుణ్ తేజ్ నటించిన ‘అంతరిక్షం’, శర్వానంద్ నటించిన ‘పడి పడి లేచె మనసు’తో పాటు కన్నడ మూవీ ‘కెజియఫ్’, తమిళ్ నుంచి ‘మారి 2’ డబ్బింగ్ చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. వీటిలో ‘కెజియఫ్’ చిత్రం భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రం. వాస్తవానికి ఈ సినిమాపై తెలుగు రాష్ట్రాల్లో అంతగా బజ్ లేదనే చెప్పాలి. కన్నడలో స్టార్ ఇమేజ్ ఉన్న యష్ ఈ సినిమాను కన్నడతో పాటు..తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో భారీగా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటివరకు కన్నడలో ఏ సినిమా ఒకేసారి ఇన్ని భాషల్లో విడుదల కాలేదు.
తెలుగులో ఈ సినిమాకు అనుకున్నంత క్రేజ్ అయితే రాలేదు. మొదటి రెండు మూడు రోజుల్లో అంతా ‘పడి పడి లేచె మనసు’, ‘అంతరిక్షం’ వైపు మొగ్గు చూపుతారు. ‘కెజియఫ్’ మీద అంత ఇంట్రెస్ట్ చూపరు. కానీ రెండుమూడు రోజులు తరువాత ఈ సినిమా పుంజుకోవడం ఖాయమని దానికి కారణం ఇందులో ఉన్న యునిక్ కంటెంటే కారణమని చెబుతున్నారు దర్శకనిర్మాతలు. ఇందులో హీరో యష్ నటన అందరినీ ఆకట్టుకుంటుందని.. పైగా యాక్షన్ సీన్స్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయని అంటున్నారు.
కోలార్ బంగారు గనుల ప్రాంతాన్ని చాలామంది పొలిటీషియన్స్, రౌడీలు ఆక్రమించుకోవాలని చూస్తుంటారు. ఆ టైమ్‌లో రాకీ అనే యువకుడు ఆ సామ్రాజ్యం కోటలను ఎలా బద్దలుకొట్టి దానికి చక్రవర్తిగా మారాడు అనేదే ‘కెజియఫ్’ కథ. ఈ సినిమాను ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసాడు. ఇందులో కళ్ళు చెదిరే సెట్స్ వేసినట్టు సమాచారం. ట్రైలర్ బట్టి చూస్తుంటే ఇది కన్నడలో సూపర్ హిట్ అవ్వడం కాయం అన్నట్టు కనిపిస్తుంది. మరి అదే రోజు తెలుగులో రెండు స్ట్రయిట్ మూవీస్.. తమిళ మూవీ ఒకటి రిలీజ్ అవుతున్నాయి. మరి వీటిని దాటుకుని ఈ సినిమా బాక్సాఫీస్ చైర్ మీద కూర్చుంటుందా.. చూద్దాం.