Advertisementt

మాస్ హీరోతో బోయపాటి శిష్యుడి చిత్రం!

Thu 20th Dec 2018 01:33 AM
arjun jandhyala,director,rx 100 hero,karthikeya,boyapati srinu assistant  మాస్ హీరోతో బోయపాటి శిష్యుడి చిత్రం!
Boyapati Srinu Assistant Turns Director with Mass Hero Film మాస్ హీరోతో బోయపాటి శిష్యుడి చిత్రం!
Advertisement
Ads by CJ

బోయపాటి శిష్యుడు అర్జున్‌ జంధ్యాల దర్శకత్వంలో కార్తికేయ

ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను వద్ద పదేళ్లుగా అసోసియేట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన అర్జున్‌ జంధ్యాల మెగా ఫోన్‌ పట్టనున్నారు. యాక్షన్‌ సినిమాలకు కేరాఫ్‌ అడ్రస్‌లా ఉండే బోయపాటి సినిమాల్లాగానే తన శిష్యుని సినిమా కూడా ఉండబోతోందట. ‘ఆర్‌ఎక్స్‌100’ సినిమాతో హీరోగా ఒక్కసారిగా వెలుగులోకి వచ్చి, బోల్డంత క్రేజ్‌ తెచ్చుకున్న కార్తికేయ ఈ చిత్రంలో హీరోగా నటించనున్నారు. తొలి చిత్రంలో మాస్‌ యాక్షన్, మంచి రొమాన్స్‌తో స్క్రీన్‌పై కనిపించారు కార్తికేయ. తాజా చిత్రంలోనూ ఓ డిఫరెంట్‌ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. 

టీవీ రంగంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్, స్ప్రింట్‌ టెలీ ఫిలిమ్స్‌ సంస్థలు ఈ చిత్రం ద్వారా సినీ నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నాయి. అనిల్‌కుమార్, తిరుమల్‌ రెడ్డి నిర్మాతలు. ఈ నెల 27న ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమవుతుందని చిత్రనిర్మాతలు తెలిపారు. 

Boyapati Srinu Assistant Turns Director with Mass Hero Film :

Arjun Jandhyala Directs RX 100 Hero Karthikeya

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ