Advertisementt

‘సాహో’ రిలీజ్ డేట్ వెనుక టాప్ నిర్మాత స్కెచ్!

Wed 19th Dec 2018 09:55 PM
karan johan,koffee with karan show,prabhas,saaho release date,august 15,bollywood top producer  ‘సాహో’ రిలీజ్ డేట్ వెనుక టాప్ నిర్మాత స్కెచ్!
Top Producer advised to announce Saaho release date ‘సాహో’ రిలీజ్ డేట్ వెనుక టాప్ నిర్మాత స్కెచ్!
Advertisement
Ads by CJ

చాలా సాఫీగా.. కూల్‌గా రోజులు గడుస్తున్నా కంగారు పడకుండా షూటింగ్ చేసుకుంటున్న సుజిత్ - ప్రభాస్‌ల ‘సాహో’ చిత్రం ఎపుడు విడుదలవుతుందో అనేది అర్ధం కాక ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. భారీ బడ్జెట్‌తో పలు భాషల్లో తెరకెక్కుతున్న సాహో చిత్రం ఇప్పటికే 80 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. అయితే సాహో షూటింగ్ పూర్తయ్యి సినిమా విడుదలకు టైమ్ ఎక్కువ పడుతుంది అనుకున్న ప్రభాస్... రాధాకృష్ణ దర్శకత్వంలో మరో సినిమాని మొదలుపెట్టేయ్యగా.. తాజాగా రాధాకృష్ణ.. తాను ప్రభాస్ తో చెయ్యబోతున్న తెలుగు, తమిళ మూవీ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది అని... ఇక సినిమా వచ్చే ఏడాది అంటే 2019 చివర్లో తమ సినిమా విడుదల ఉంటుందని చెప్పాడు.

ఇక తాజాగా సాహో రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ అయ్యింది. అది కూడా కరణ్ జోహార్ సలహా మేరకు సాహో సినిమా విడుదల డేట్ ని  నిర్మాతలు లాక్ చేశారట. సాహో సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో టార్గెట్‌గా తెరకెక్కడంతో... తెలుగు తమిళ భాషల్లో రెండు నెలల ముందు సినిమా విడుదల డేట్ ఇచ్చినా పర్లేదు కానీ.. హిందీ‌లో అలా కాదు చాలా సినిమాలు మొదలైనప్పుడే విడుదల డేట్ లాక్ చేసేస్తారు. మరి అప్పటికప్పుడు సాహో విడుదల అంటే హిందీలో చాలా పోటీ ఉంటుంది అందుకే... సాహో విడుదల డేట్ త్వరగా ప్రకటించమని కాఫీ విత్ కరణ్ షో లో పాల్గొన్న ప్రభాస్ కి బాలీవుడ్ దిగ్గజం కరణ్ జోహార్ సలహా ఇచ్చాడట. 

కరణ్ జోహార్ సలహా మేరకు ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీ‌లో షూటింగ్ జరుగుతున్న సాహో చిత్రాన్ని 2019 ఆగష్టు 15న స్వాతంత్య దినోత్సవం రోజున విడుదలకు నిర్మాతలు డేట్ లాక్ చేసేసారు. మరి ప్రభాస్ రెండు చిత్రాలు 2019 ద్వితీయార్ధంలోనే సందడి చేయబోతున్నాయి. మరి ఒకే ఏడాది రెండు సినిమాలతో ప్రభాస్ తన ఫ్యాన్స్‌ని అలరించబోతున్నాడు.

Top Producer advised to announce Saaho release date:

KJO Behind Saaho Release date Announcement

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ