Advertisementt

క్రిష్ భలే తప్పించుకున్నాడు

Wed 19th Dec 2018 09:03 PM
krish,kangana,manikarnika  క్రిష్ భలే తప్పించుకున్నాడు
Krish Got Lucky With kangana క్రిష్ భలే తప్పించుకున్నాడు
Advertisement
Ads by CJ

ఒక సినిమా హిట్ అయితే.. దర్శకుడికి క్రెడిట్ వస్తుందో రాదో తెలియదు కానీ.. సినిమా ఫ్లాప్ అయితే మాత్రం ఆ పరాజయం తాలూకు క్రెడిట్ మొత్తం దర్శకుడి ఖాతాలోనే పడిపోతుంది. అయితే.. దర్శకుడు క్రిష్ కి మాత్రం ఎక్కడో గట్టి సుడి ఉన్నట్లు ఉంది. ఎందుకంటే.. మునుగుతున్న నావ లాంటి మణికర్ణిక సినిమా డైరెక్షన్ క్రెడిట్ ను ఇప్పుడు కంగనా షేర్ చేసుకొంది. టీజర్ రిలీజ్ టైమ్ లో దర్శకత్వం అనే టైటిల్ కార్డ్ కింద కేవలం క్రిష్ పేరు మాత్రమే ఉండగా.. నిన్న విడుదలైన ట్రైలర్ లో మాత్రం క్రిష్ పేరు కింద కంగనా పేరు కూడా యాడ్ అయ్యింది. 

మరి ఈ సినిమాతో దర్శకురాలిగా మారిన కంగనా ఆ సినిమాకు ఎంత వర్క్ చేసింది అనేది తెలియదు కానీ.. నిన్న జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మాత్రం సినిమా మొత్తం తానే తీసినంత బిల్డప్ ఇచ్చింది. దాంతో కొందరు క్రిష్ క్రెడిట్ మొత్తం కొట్టేస్తుంది అని బాధపడినప్పటికీ.. జనవరిలో విడుదలవుతున్న ఈ సినిమా ఫెయిల్ అయితే ఆ క్రెడిట్ మాత్రం క్రిష్ కు రాదు అని సంతోషపడేవాళ్లూ లేకపోలేరు. 

నిన్న విడుదలైన ట్రైలర్ కి సరైన రెస్పాన్స్ లభించలేదు. సినిమాలోని గ్రాఫిక్స్ కానీ.. కెమెరా వర్క్ కానీ ఆ భారీ కాన్వాస్ రేంజ్ లో లేవు. దాంతో ఈ సినిమాపై కొత్త అంచనాలు నెలకొనడం అటుంచితే.. ఉన్న అంచనాలు పోయాయి. 

Krish Got Lucky With kangana:

With Kangana Taking the Direction Credits for Manikarnika.. Krish is Safe about the result credit

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ