Advertisementt

ఎన్టీఆర్ కి ముందుగానే చెప్పిన కేటీయార్

Wed 19th Dec 2018 06:51 PM
ntr,ktr,suhasini,kukatpally  ఎన్టీఆర్ కి ముందుగానే చెప్పిన కేటీయార్
KTR Warned NTR in Prior to Elections ఎన్టీఆర్ కి ముందుగానే చెప్పిన కేటీయార్
Advertisement
Ads by CJ

తెలంగాణ ఎలక్షన్స్ ముగిసి వారం పూర్తవుతున్నా.. ఇప్పటికీ సదరు ఎలక్షన్స్ కి సంబంధించిన ఏదో ఒక విశేషం హడావుడి చేస్తూనే ఉంది. తాజాగా తన అక్క సుహాసినిని ఎన్నికల బరిలో దింపిన నందమూరి సోదరులు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు ప్రచారం ఎందుకు పాల్గొనలేదు అనే విషయం మీద భారీ స్థాయి ప్రచారం జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ ఆమెను కూకట్ పల్లి నుంచి నిలబెడుతున్నామని చెప్పగా.. వెంటనే ఒక ప్రెస్ నోట్ ద్వారా స్పందించిన ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తర్వాత చప్పుడు చేయలేదు. ఏమైనా అంటే సినిమాల్లో బిజీ అని ఫ్యాన్స్ కవర్ చేస్తూ వచ్చారు. 

అయితే.. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఎన్నికల బరిలో సుహాసినిని నిలబెడుతున్న వార్త వచ్చిన వెంటనే ఎన్టీఆర్ కి కేటీయార్ నుంచి ఫోన్ వచ్చిందట. ఆల్రెడీ తమ పార్టీ సభ్యుడు ఆ ఏరియాలో చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు. ఇప్పుడు అక్కడ ఎవరు పోటీ చేసినా ఓడిపోవడం ఖాయం.. మీ అక్కను ఎలాగూ నిల్చోబెట్టేశారు.. నువ్ ప్రచారానికి వెళ్ళి అభాసుపాలవ్వకు అని హితబోధ చేశాడట కేటీఆర్. దాంతో కనీసం సోషల్ మీడియాలో అయినా అక్కకు కాస్త పుష్ ఇద్దామనుకున్న ఎన్టీఆర్ సైలెంట్ అయిపోయాడట. 

పార్టీ పరమైన విబేధాలు పక్కన పెడితే.. కేటీఆర్ నందమూరి, మెగా ఫ్యామిలీ హీరోలతో చాలా క్లోజ్ రిలేషన్ మెయిన్ టైన్ చేస్తాడు. ఆ రిలేషన్ కి వేల్యూ ఇచ్చే తన స్నేహితుడు ఎన్టీఆర్ కోసం కేటీయార్ ఇలా జాగ్రత్త తీసుకొన్నాడని పేర్కొంటున్నారు కొందరు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియదు కానీ.. ఎన్టీఆర్ మాత్రం తన పేరు పాడవ్వకుండా బయటపడిన విధానం మాత్రం బాగుంది. 

KTR Warned NTR in Prior to Elections:

KTR called and warned NTR about suhasini will lose in kukatpally and he asked him to stay away from this

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ