Advertisementt

అప్పుడు బాలయ్య ఇప్పుడు పవన్ కళ్యాణ్: మీకో దండం

Tue 18th Dec 2018 08:45 PM
pawan kalyan,balakrishna,bhagat singh  అప్పుడు బాలయ్య ఇప్పుడు పవన్ కళ్యాణ్: మీకో దండం
Its Pawan Kalyan After Balakrishna అప్పుడు బాలయ్య ఇప్పుడు పవన్ కళ్యాణ్: మీకో దండం
Advertisement
Ads by CJ

నిన్నమొన్నటివరకూ బాలయ్య హిందీ ప్రసంగాలు, తెలుగు పాండిత్యం విని నవ్వుకున్నారు మెగా అభిమానులు. ఇప్పుడు నందమూరి అభిమానుల వంతు వచ్చింది. ఇక వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ ప్రసంగాలు విని నవ్వుకుంటున్నారు. 

మాములుగానే చాలా ఇమ్మెచ్యూర్డ్ గా, క్లారిటీ లేకుండా మాట్లాడే పవన్ కళ్యాణ్ మొన్న డల్లాస్ వెళ్లినప్పుడు షహీద్ భగత్ సింగ్ ఆత్మహత్య చేసుకుని మరణించాడు అని పేర్కొనడం చర్చనీయాంశం మాత్రమే కాదు.. ట్రోల్ కూడా అయ్యాడు. 23 ఏళ్ల వయసులోనే బ్రిటీష్ వారికి ఎదురెల్లి ఉరి తీయబడ్డ భగత్ సింగ్ లాంటి సాహస వీరుడు ఆత్మహత్య చేసుకున్నాడని పవన్ కళ్యాణ్ వేలమంది ముందు చెప్పడంతో నవ్వులపాలయ్యాడు. 

పవర్ స్టార్ చదివిన కొన్ని పుస్తకాల్లో అలా ఉందని ఆయన అభిమానులు సర్దిచెప్పడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ.. దేశ చరిత్రను తప్పుగా ప్రొజెక్ట్ చేస్తున్నందుకు పవన్ కళ్యాణ్ ను సీనియర్ సిటిజన్స్ మాత్రం తిట్టి పోస్తున్నారు. సినిమాల్లో ఉన్నప్పుడు ఈ తరహా వ్యాఖ్యలు చేసినా పర్లేదు కానీ.. రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండడమే కాక తదుపరి ఎన్నికల్లో పోటీ చేసేందుకు సన్నద్ధమవుతున్న పవన్ కళ్యాణ్ ఇలా మిడిమిడి జ్ణానంతో మాట్లాడుతుండడం నిజంగా సిగ్గుచేటు. ఇకనైనా పవన్ కళ్యాణ్ తన మాటలను ఒకటికి రెండుసార్లు చూసుకోవాలని అభిమానులు కోరుకొంటున్నారు.

Its Pawan Kalyan After Balakrishna:

PK Dallas Speech Gone Viral and People Trolling, Laughing for his half knowledge 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ