Advertisementt

హీరోయిన్నే చెప్పింది.. ఆ హీరోతో చేయట్లేదని!

Mon 17th Dec 2018 12:27 PM
raashi khanna,clarity,gopichand,next movie,heroine  హీరోయిన్నే చెప్పింది.. ఆ హీరోతో చేయట్లేదని!
Heroine Clarity on Her next Movie హీరోయిన్నే చెప్పింది.. ఆ హీరోతో చేయట్లేదని!
Advertisement
Ads by CJ

ఈ ఏడాది తొలిప్రేమతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న రాశిఖన్నా శ్రీనివాస కల్యాణంతో బిగ్గెస్ట్ డిజాస్టర్ అందుకుంది. రాశిఖన్నాకి అందం అభినయం ఎంత ఉన్నా లక్కే లేదు. అందుకే స్టార్ హీరో ఎన్టీఆర్ పక్కన నటించిన.. అమ్మడుకి లక్కనేది కలిసి రావడం లేదు. చిన్నా చితక హీరోలతోనే సర్దుకుపోతున్న రాశిఖన్నా యాక్షన్ హీరో గోపిచంద్ సరసన ఒక సినిమాలో నటించబోతుంది అంటూ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలోనూ, వెబ్ మీడియాలోనూ ఒక న్యూస్ చక్కర్లు కొడుతోంది. గతంలోనే గోపీచంద్ - రాశిఖన్నా లు కలిసి జిల్ సినిమాలోనూ, ఆక్సిజన్ సినిమాలోనూ నటించారు. అయితే ఆ రెండు సినిమాలు డిజాస్టర్ సినిమాలే.

తాజాగా గోపీచంద్ తో రాశిఖన్నా మరోసారి నటించబోతుందంటూ పెద్ద ఎత్తున వార్తలు రావడంతో... తాను గోపీచంద్ సినిమాలో నటిస్తున్నానని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని... రాశిఖన్నానే స్వయంగా గోపీచంద్ మూవీ విషయంలో స్పందించడంతో ఎట్టకేలకు ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పడింది. మరి గత కొంతకాలంగా ప్లాప్స్ లో ఉన్న గోపీచంద్ ఈసారి తమిళ డైరెక్టర్ ని నమ్ముకున్నాడు. డైరెక్టర్ తిరు దర్శకత్వంలో అనిల్ సుంకర నిర్మాతగా తెరకెక్కుతున్న సినిమాలో గోపీచంద్ నటిస్తున్నాడు. ఇక తాజాగా గోపీచంద్ పక్కన రాశిఖన్నా అని వార్తలొచ్చినా.. రాశిఖన్నానే స్వయంగా గోపి పక్కన నటించడం లేదని చెప్పడంతో... ఇప్పుడు డైరెక్టర్ తిరు సినిమాలో గోపీచంద్ పక్కన నటించబోయే ఆ హీరోయిన్ ఎవరనేదానిమీద అందరిలో ఆసక్తి నెలకొంది.

Heroine Clarity on Her next Movie:

Raashi Khanna Not in Gopichand Movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ