మొన్నటివరకు ఎన్టీఆర్ - బాలయ్య కలుస్తారా? కలవరా? అని అనుకున్నారు. తీరా ఎన్టీఆర్ - బాలయ్య కలిశాకా... ఎన్టీఆర్ ను బాలయ్య ఆ ఫంక్షన్ కి పిలుస్తాడా? బాలయ్యను, ఎన్టీఆర్ ఈ ఫంక్షన్ కి పిలుస్తాడా అని మొదలయ్యాయి. అవును మరో వారం రోజుల్లో ఎన్టీఆర్ బయోపిక్ ప్రీరిలీజ్ ఫంక్షన్ కృష్ణా జిల్లా నిమ్మకూరులో జరగనుంది. డిసెంబర్ 21 న జరిగే ఈ ఫంక్షన్ నందమూరి ఫ్యామిలీ మొత్తం అటెండ్ అవ్వనుంది.
నందమూరి ఫ్యామిలీ అంటే అందరూ వస్తారు కాబట్టి ఆ ఫంక్షన్ కి జూనియర్ ఎన్టీఆర్ కూడా వస్తాడా? అసలు ఆయనను ఆహ్వానిస్తారా? ఎన్టీఆర్ తో పాటు తన తల్లిని కూడా పిలుస్తారా? అన్న ప్రశ్నలు మొదలయ్యాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఇంతవరకు ఎన్టీఆర్ కు ప్రీ రిలీజ్ ఆహ్వానం అందలేదు అని తెలుస్తుంది. ఎన్టీఆర్ తల్లిని పిలిచినా, పిలవకపోయినా ఎన్టీఆర్ అయితే కచ్చితంగా పిలుస్తారు అని బాలయ్య దగ్గర సన్నిహితులు అంటున్నారు. మరో వారం టైం ఉంది కాబట్టి ఈలోపుల ఎన్టీఆర్ ను బాలయ్య పిలిచే అవకాశం ఉంది అని చెబుతున్నారు.
ఎన్టీఆర్ బయోపిక్ లో కళ్యాణ్ రామ్ ఉన్నాడు కాబట్టి కళ్యాణ్ ను ఎలాగూ పిలుస్తారు. బాలయ్య ‘అరవింద సమేత’ సక్సెస్ మీట్ కు వచ్చాడు కాబట్టి ఎన్టీఆర్ కూడా ఎన్టీఆర్ ప్రీ రిలీజ్ ని వస్తాడు అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఒకవేళ ఎన్టీఆర్ ను పిలిస్తే, అతగాడు వెళ్తే మాత్రం ఫంక్షన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతాడు. మరి బాలయ్యకు ఇది నచ్చుతుందో లేదో..