సంక్రాంతి పండక్కి ఇంకా 25 రోజుల టైమ్ ఉంది. ఈలోపు వినయ విధేయ రామ సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్, డబ్బింగ్ అన్నీ ఫినిష్ అవ్వాలి. ఇంకా టాకీ పార్ట్ కూడా పూర్తవ్వలేదు. పైగా ఒక ఐటెమ్ సాంగ్ కూడా పెండింగ్ ఉంది. మళ్ళీ డబ్బింగ్ అదనపు పని అనుకోండి. ఇవన్నీ కంప్లీట్ చేయడానికి బోయపాటి శ్రీనుకి సరిగ్గా 10 రోజుల టైమ్ ఇచ్చాడు రామ్ చరణ్. నిన్నటివరకూ ప్రమోషన్స్ విషయంలో బోయపాటి టెన్షన్ పడుతున్నాడని తెలిసి చరణ్ ఇన్వాల్వ్ అయ్యి అర్జెంట్ గా ప్రమోషన్స్ స్టార్ట్ చేయించాడు. దాంతో బోయపాటి కాస్త రిలీఫ్ పొంది.. ప్రస్తుతం తన కాన్సన్ ట్రేషన్ మొత్తం షూటింగ్ ను పూర్తి చేయడం మీద పెట్టాడు.
కీలకమైన ఫైట్ సీన్స్ మరియు హీరోహీరోయిన్ కాంబినేషన్ సీన్స్ అన్నీ పూర్తవ్వడంతో.. కేవలం చరణ్ మరియు ప్రశాంత్ కాంబినేషన్ సీన్స్ పెండింగ్ ఉన్నాయట. వాటిని ఈ పదిరోజుల గ్యాప్ లో పూర్తి చేసి.. బాలీవుడ్ హాటీ ఈషా గుప్తాతో ప్లాన్ చేసిన ఐటెమ్ సాంగ్ పిక్చరైజేషన్ కూడా పూర్తి చేసి డబ్బింగ్ స్టూడియోలో కూర్చోని పనులు వేగవంతం చేయించాలన్నది బోయపాటి ప్లాన్. ఆల్రెడీ ఆయన బ్రదర్ ప్రసాద్ ల్యాబ్ లోనే ఉంటూ మిగతా ఆర్టిస్ట్స్ డబ్బింగ్ పనులు దగ్గరుండి మరీ చూసుకుంటుండగా.. జనవరి 5 కల్లా ఫస్ట్ కాపీ రెడీ చేసి మెగా ఫ్యామిలీకి చూపించాలని చరణ్ ఆదేశించాడట.
సో, అప్పుడు సినిమా చూసిన జనాలు ఏదైనా చిన్న చిన్న మార్పులు చెబితే సరిదిద్దుకోవడానికి సమయం కూడా దొరుకుతుందని చరణ్ ప్లాన్, మరి చరణ్ చెప్పిన ప్రకారం ఈ తక్కువ టైమ్ లో బోయపాటి ఇదంతా కంప్లీట్ చేయగలడో లేదో చూడాలి. కంట్రోల్ మొత్తం చరణ్ చేతుల్లోకి వెళ్ళిపోవడంతో అనుకున్న సమయానికి పనులన్నీ పూర్తి చేయగలనా అని బోయపాటి బెంబేలెత్తుతున్నాడట.