Advertisementt

మెగాస్టార్ కోసం కొరటాల స్కెచ్ అదిరింది!

Fri 14th Dec 2018 11:05 PM
koratala siva,chiranjeevi,ram charan,special role,bharat ane nenu,mega fans  మెగాస్టార్ కోసం కొరటాల స్కెచ్ అదిరింది!
Koratala Siva Superb Sketch for Megar Star Chiranjeevi మెగాస్టార్ కోసం కొరటాల స్కెచ్ అదిరింది!
Advertisement
Ads by CJ

‘భరత్ అనే నేను’ తర్వాత దర్శకుడు కొరటాల శివ.. మెగాస్టార్ చిరు తో సినిమా కోసం కథను సిద్ధం చేసుకుంటున్నాడు. ఎప్పుడూ కమర్షియల్ ఫార్మెట్‌ను వదలకుండా.. మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలు తెరకెక్కించే కొరటాల శివ.. ఈసారి కూడా చిరంజీవితో మరో ఠాగూర్ తరహా కథను పక్కాగా సిద్ధం చేస్తున్నాడని తెలుస్తుంది. ఈ సినిమా ద్వారా ఒక స్ట్రాంగ్ మెసేజ్ సమాజానికి ఇవ్వడానికి కొరటాల ప్లాన్ చేస్తున్నాడనే విషయం ఎప్పటి నుండో ప్రచారం ఉంది. ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని మెగా ఫాన్స్ ఆరాటపడుతున్నారు. ప్రస్తుతం సై రా నరసింహారెడ్డి సినిమా షూటింగ్ లో బిజీగా వున్న చిరు, కొరటాల సినిమా కోసం ఫిబ్రవరి నుండి తయారవుతా=డని.. ఇక కొరటాల - చిరు మూవీ సంక్రాతి తర్వాత మొదలవ్వబోతుందని చెబుతున్నారు. =ఈ సినిమాలో చిరంజీవి కోసం కొరటాల హీరోయిన్ ని కూడా ఫైనల్ చేసినట్లుగా వార్తలొస్తున్నాయి. సై రా నరసింహ రెడ్డి లో చిరు సరసన నటిస్తున్న నయనతారే చిరు పక్కన కొరటాల సినిమాలో నటిస్తుందట.

మాములుగా  కొరటాల శివ - చిరు సినిమా అంటేనే భారీ  క్రేజ్ ప్రేక్షకుల్లోనూ, ట్రేడ్ లోను ఉంటుంది. అయితే ఈ క్రేజ్ ని మరింత పెంచే ప్లాన్ కొరటాల చేస్తున్నాడట. అది కూడా అలాంటి ఇలాంటి ప్లాన్ కాదట. కొరటాల చిరు కోసం రాసే కథలో ఒక కీలక పాత్రని రాసుకున్నాడట. అయితే ఆ అపాత్ర కోసం చిరు తనయుడు, స్టార్ హీరో రామ్ చరణ్ ని తీసుకోబోతున్నాడట. మరి చిరు ఖైదీ నెంబర్ 150 లో రామ్ చరణ్ ఒక సాంగ్ లో మెరిస్తే... చిరు, రామ్ చరణ్ ఒకటిరెండు మూవీస్ లో మెరిశాడు. అయితే కొరటాల ఈ సినిమాలో రామ్ చరణ్ కి గెస్ట్ లాంటి పాత్రని ప్రత్యేకంగా డిజైన్ చేసాడట. మరి ఇలా వచ్చి అలా వెళ్లిపోయే పాత్ర కాకుండా కొన్ని నిమిషాల పాటు చరణ్ ని చిరు - కొరటాల మూవీ లో మనం చూడొచ్చని.. ఇక ప్రస్తుతం ఈ సినిమా మీద ఉన్న అంచనాలు.. చరణ్ రాకతో మరింత పెరుగుతాయని కొరటాల ఇలా ప్లాన్ చేసాడట. మరి కీలక పాత్ర అంటే కథకు అదెంత ఇంపార్టెంటో అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అన్నమాట. మరి తండ్రి సినిమాలో కొడుకు క్యామియో చెయ్యడం మాత్రం సూపర్ అంటూ మెగా ఫాన్స్ అప్పుడే పండగ చేసేసుకుంటున్నారు.

Koratala Siva Superb Sketch for Megar Star Chiranjeevi:

Mega Power Star Ram Charan special role in Koratala Siva and Chiranjeevi Film

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ