Advertisementt

వెంకీ కుమ్మేస్తాడు.. డౌట్స్ అన్నీ వరుణ్ పైనే?

Fri 14th Dec 2018 10:55 PM
varun tej,comedy,venkatesh,f2 teaser,varun tej and venkatesh,anil ravipudi  వెంకీ కుమ్మేస్తాడు.. డౌట్స్ అన్నీ వరుణ్ పైనే?
Doubts on Varun Tej.. Not Venky వెంకీ కుమ్మేస్తాడు.. డౌట్స్ అన్నీ వరుణ్ పైనే?
Advertisement
Ads by CJ

విక్టరీ వెంకటేష్ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కాంబినేషన్ లో దిల్ రాజు బ్యానర్‌లో ‘పటాస్’ ఫేమ్ అనిల్ రావిపూడి ‘F2’ అనే మల్టీస్టారర్‌ని తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేసి, ఈ సంక్రాంతి మేమే హిట్ కొట్టేది అని హింట్ ఇచ్చేశారు. డైరెక్టర్ అనిల్ రావిపూడి కామెడీ డీల్ చేయడంలో దిట్ట. అది తన గత చిత్రాలు చూస్తే అర్ధం అవుతుంది.

కేవలం టీజర్ చూస్తేనే సినిమాలో కామెడీ ఏ రేంజ్‌లో ఉండబోతుందో అర్ధం అయిపోతుంది. ఇందులో వెంకీ - వరుణ్ లు తోడల్లుళ్ళుగా నటించారు. పెళ్లికి ముందు మగవాళ్ళు ఏమనుకుంటారు.. పెళ్ళైన తర్వాత ఏం తెలుసుకుంటారు అనేది ఈ ఇద్దరుతో అనిల్ బాగానే చేయించాడని అర్ధం అవుతుంది. పెళ్లికి ముందు పెళ్లాలతో ఎలా ఉండాలో మాకు తెలుసు అనుకున్న వీళ్ళకి ఎటువంటి సంఘటనలు ఎదురు అవుతాయో సినిమాలో చూడాలి. వెంకీకి జోడిగా తమన్నా.. వరుణ్ కి జోడిగా మెహ్రీన్ నటిస్తున్నారు.

కాన్సెప్ట్ పాతదే అయినా అనిల్ ఏదొక మ్యాజిక్ చేసేసి సినిమాను హిట్ చేసేస్తాడు అనే నమ్మకం అయితే ఉంది. అంతా బాగానే ఉంది కానీ వెంకీ కామెడీ టైమింగ్‌ని వరుణ్ తేజ్ అందుకోగలడా అని కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. వెంకీ కామెడీ ఏ రేంజ్‌లో పండించగలడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎటువంటి సీన్ ఇచ్చినా అవలీలగా చేసే వెంకీతో.. వరుణ్ కామెడీ చేయగలడా? అని అంటున్నారు. ఇద్దరూ తోడల్లుళ్ళు కాబట్టి..  దాదాపు వెంకీ, వరుణ్ కాంబినేషన్‌లో ఎక్కువ కామెడీ సీన్స్ ఉండే అవకాశం ఉంది. పైగా వరుణ్ ఇప్పుడివరకు సరైన కామెడీ టైమింగ్ ఉన్న సినిమాలు చేయలేదు. అన్ని సీరియస్ పాత్రలు ఉండే సినిమాలే చేసుకొచ్చాడు. వెంకీ తో వరుణ్ కనీసం 70 % అయినా మ్యాచ్ చేస్తే గానీ ఆ సీన్లు పండే అవకాశం లేదు. మరి వరుణ్.. వెంకీని అందుకోగలడా.. తెలియాలంటే జనవరి 12 వరకు ఆగాల్సిందే.

Doubts on Varun Tej.. Not Venky:

Doubts Raised on Varun Tej in F2 Comedy 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ