కొంత మందికి ఎంత ట్రై చేసినా కాలం కలిసి రాదు. కొంత మంది మాత్రం కలిసొచ్చే కాలం వరకు ఎదురుచూస్తుంటారు. ఒక్కసారి ఆ టైమ్ స్టార్టయిందా వారిని పట్టుకోవడం ఎవరి తరం కాదు. `పెళ్లి చూపులు`. `అర్జున్‌రెడ్డి` సినిమాలకి ముందు విజయ్ దేవరకొండ అంటే ఎవరికీ తెలియదు. అతని గురించి పట్టించుకున్న వారే లేరు. ఎక్కడో గ్రూపులో ఓ మూలన `లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్` సినిమాలో మెరిన విజయ్ దేవరకొండ ఇప్పుడు నిర్మాతల పాలిట బంగారుకొండగా మారాడు. గతంలో అతని సినిమా కొనడానికే ఆసక్తి చూపని డిస్ట్రీ బ్యూటర్స్ ఇప్పుడు ఎగబడుతున్నారు.
ఇటీవల డిజాస్టర్‌గా నిలుస్తందని ప్రచారం చేసిన `టాక్సీవాలా` ఊహించని స్థాయిలో విజయాన్ని అందుకోవడం విజయ్ దేవరకొండ మార్కెట్‌ను మరింత పెంచిందని తెలుస్తోంది. దీపం వుండగానే ఇల్లు జక్కబెట్టుకోవాలన్నట్టుగా విజయ్ తన రెమ్యునరేషన్‌ను ఏకంగా 9 కోట్లకు పెంచినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. `గీత గోవిందం`. టాక్సీవాలా` చిత్రాలకు విజయ్ తీసుకున్న రెమ్యునరేషన్ 40 నుంచి 50 లక్షలు మాత్రమేనట. `పెళ్లి చూపులు` చిత్రం తరువాత అంగీకరించిన చిత్రాలు కావడం, అప్పటికి విజయ్‌కి అంత క్రేజ్ లేకపోవడం వల్ల పారితోషికం తక్కువ తీసుకున్నాడట.
అయితే ఇప్పుడు మాత్రం విజయ్ 9 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు లేటెస్ట్ న్యూస్. ఈ ఏడాది తన పారితోషికాన్ని 3 కోట్లకు పెంచిన విజయ్ దేవరకొండ తను నటించిన `గీత గోవిందం`, `టాక్సీవాలా` భారీ స్థాయిలో వసూళ్లని రాబట్టడంతో 9 కోట్లు డిమాండ్ చేస్తున్నాడని తెలిసింది. `డియర్ కామ్రేడ్` తరువాత క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఓ సినిమాకు కమిట్ అయిన విజయ్ ఈ చిత్రం కోసం ఏకంగా ఏడున్నర కోట్లు తీసుకున్నట్లు తెలిసింది. ఈ సినిమా తరువాత చేయబోయే చిత్రాలకు మాత్రం 9 కోట్లకు తక్కువ తీసుకునే ప్రసక్తే లేదని నిర్మాతలకు తేల్చి చెబుతున్నట్లు ఫిలిమ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది.