Advertisementt

RRR: యంగ్ టైగర్‌ టీమ్‌కి రాజమౌళి వార్నింగ్?

Fri 14th Dec 2018 12:56 PM
rajamouli,ram charan,ntr,rrr movie,latest update  RRR: యంగ్ టైగర్‌ టీమ్‌కి రాజమౌళి వార్నింగ్?
Rajamouli warning to Young Tiger NTR Team RRR: యంగ్ టైగర్‌ టీమ్‌కి రాజమౌళి వార్నింగ్?
Advertisement
Ads by CJ

రాజమౌళి ఇప్పుడు ఇద్దరు బిగ్ స్టార్స్ ని హ్యాండిల్ చేస్తున్నాడు. రామ్ చరణ్ రంగస్థలంతో ఫుల్ ఫామ్ లో ఉన్న స్టార్ హీరో. ఇక ఎన్టీఆర్ కూడా బోలెడంత క్రేజున్న స్టార్ హీరో. మరి అలాంటి స్టార్స్ తో రాజమౌళి సినిమా అంటే అది ఎలా ఉండబోతుందో అనేది కనీసం ఊహకి కూడా అందదు. ప్రభాస్ ని కూడా మంచి క్రేజున్నప్పుడే అతనితో బాహుబలి సినిమా చేస్తే ప్రభాస్ క్రేజ్ కేవలం ఇండియాలోనే కాదు.. వరల్డ్ వైడ్ గా గుర్తింపు పొందాడు. ఇక తాజాగా ఎన్టీఆర్, చరణ్ లతో RRR మొదలుపెట్టేశాడు. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ ని కంప్లీట్ చేసిన రాజమౌళి సెకండ్ షెడ్యూల్ కోసం లాంగ్ గ్యాప్ తీసుకోబోతున్నాడు. ఇక ఫస్ట్ షెడ్యూల్ లో ఇద్దరు హీరోల మీద యాక్షన్ సన్నివేశాలను రాజమౌళి తెరకెక్కించిన విషయం తెలిసిందే.

అయితే ఫస్ట్ షెడ్యూల్ లో ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ లు గుబురు గెడ్డాలతోనే కనబడతారనేది వారి ఒరిజినల్ లుక్స్ చూస్తుంటే తెలుస్తుంది. ఇక సెకండ్ షెడ్యూల్ మొదలయ్యేసరికి ఎన్టీఆర్ ఫిజికల్ గా కూడా మేకోవర్ కాబోతున్నాడట. అరవింద తర్వాత RRR షెడ్యూల్ కోసం కాస్త లావెక్కిన ఎన్టీఆర్.. తదుపరి RRR షెడ్యూల్ కోసం ఫిజికల్ గా మేకోవర్ అవుతున్నాడు అంటే మళ్లీ సిక్స్ ప్యాక్ లాంటి కండలు తిరిగిన బాడీతో కనిపిస్తాడేమోలే అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉత్సాహపడుతున్నారు.. అయితే అరవింద సమేత కోసం ట్రైనర్ లాయిడ్‌ స్టీవెన్స్‌ ఆధ్వర్యంలో మంచి ఫిజిక్ లోకి మారిన ఎన్టీఆర్ ఇప్పుడు RRR కోసం కూడా లాయిడ్‌ స్టీవెన్స్‌ ఆధ్వర్యంలో జిమ్ చేస్తున్నాడట.

అయితే ఎన్టీఆర్ మేకోవర్ గురించి కానీ.. అతని జిమ్ ఫొటోస్ వీడియోస్ కానీ ఎక్కడ లీక్ కానివ్వొద్దని రాజమౌళి, ఎన్టీఆర్ టీంకి ఆర్డర్ పాస్ చేశాడట. ఫిజికల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ కి సంబందించిన ఫొటోగాని... అలాగే ట్రైనింగ్ లో ఉన్న జిమ్ ఫొటోస్ కానీ ఎక్కడా బయటికి పోనివ్వొద్దని ఎన్టీఆర్ టీంకి రాజమౌళి స్ట్రిట్ గా చెప్పేశాడట. మరి జిమ్ ట్రైనర్లు ఎవరైనా తమ పనితనం బయటికి తెలియాలని.. తాము ఎవరికైతే (సెలబ్రిటీస్ ట్రైనింగ్ ఇస్తున్నారో వారితో ఫోటో దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు ఇక అలా కూడా ఎన్టీఆర్ ఫొటోస్ బయటికి రాకూడదని రాజమౌళి వార్నింగ్ ఇచ్చాడట. మరి తాను ఎన్టీఆర్ RRR లుక్ ని బయటికి వదిలేవరకు ఎలాంటి క్లూ కూడా మీడియాకి దొరక కూడదని రాజమౌళి ఆలోచనలా ఉంది.

Rajamouli warning to Young Tiger NTR Team:

RRR Movie Latest Update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ